కొన్ని మసాలాలు (spices) పోషక ప్రయోజనాలను కలిగి ఉంటాయి. దాదాపు అన్ని మసాలాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి, అయితే కొన్ని మరింత సహాయపడతాయి.
పసుపు
పసుపు మంచి ఔషధం అన్ని వంటకాలలో ఇది వాడటం భారతీయుల అలవాటు. దెబ్బలకు, కాలిన గాయాలకు కూడా ఇది ఆయింట్మెంట్ గా పనిచేస్తుంది. జలుబు, దగ్గులకు ఇది టానిక్‌గా పనిచేస్తుంది. పసుపులో కర్కుమిన్ అనే పదార్ధం ఉంది, అది యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేస్తుంది.
కసూరి మేతి
ఈ మసాలా వంటలకు అద్భుతమైన రుచిని జోడించడమే కాకుండా, ఇందులో ఫైబర్ ఉంటుంది శరీరంలో కొలెస్ట్రాల్ మరియు ఇన్ఫ్లమేషన్ ని దూరం చేయడం లో ఇది బాగా పనిచేస్తుంది. ఇది మీ జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది మరియు రక్తంలో చక్కెరను కూడా అదుపులో ఉంచుతుంది, ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడుతుంది.
ధనియాల పొడి
ధనియాల పొడి గ్యాస్ నుండి ఉపశమనానికి పనికివస్తుంది మరియు జీర్ణ ప్రక్రియ సులభతరం చేస్తుంది, అందుకే దీనిని పురాతన కాలం నుండి మన వంటశాలలలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఈ ధనియాల పొడిని వంటలలో ఉపయోగించడం ఆరోగ్యానికి మంచిది. ఇది మొత్తం యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది, ఇది జీర్ణక్రియను పెంచడంలో సహాయపడుతుంది మరియు తద్వారా మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
గరం మసాలా
ఇది మసాలా దినుసుల యొక్క మిశ్రమం , ఇది యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది, జీర్ణక్రియను పెంచడంలో సహాయపడుతుంది మరియు తద్వారా మన రోగనిరోధక శక్తిని సమతుల్యంగా ఉంచుతుంది.
మీ ఇంట్లో ఈ మసాలాలు ఉండేలా చూసుకోండి : ధనియాలు , పసుపు, సొంపు , ఎండుమిర్చి, జీలకర్ర, సొంటి , ఆవాలు, దాల్చిన చెక్క, కొత్తిమీర , లవంగాలు, ఇంగువ, ఏలకులు, జాపత్రి మొదలగునవి.
also read news:
Superstar Krishna: కృష్ణ అభిమాన సంఘానికి చిరు అధ్యక్షుడిగా ఉన్నారా…!