Telugu Flash News

Special Stories : భయపెట్టే పర్యాటక ప్రదేశం.. అది ఎక్కడుంది? అక్కడ ఎవరు చనిపోయారు?

Special Stories : అమెరికాలో 8 హత్యలు జరిగిన ఒక ఇల్లును ఆ ప్రాంతంలోని మ్యూజియం వాళ్ళు పర్యాటక ప్రదేశంగా వాడుతున్నారు. ఆ ఇల్లు ఎవరిది?అది ఎక్కడుంది?అక్కడ ఎవరు చనిపోయారు? తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

అమెరికాలోని విల్లిస్కా అనే ఊరిలో సారా,జోసియా బి మూర్స్ దంపతులు తమ నలుగురు పిల్లలతో నివసిస్తూ ఉండేవారట.మూర్స్ కుటుంబం తమ చుట్టు పక్క ఇళ్ళలో ఉండే వారితో చాలా చనువుగా,ఒకరికి ఒకరు సహాయ పడుతూ ఆనందంగా తమ జీవితాన్ని గడుపుతుండేవారట.కానీ ఆలాంటి మూర్స్ కుటుంబం ఒక రాత్రికి రాత్రే హత్యకు గురై చనిపోతారు ఎవరూ ఊహించలేదు.

ఆ రాత్రి ఏం జరిగింది ?

1912,జూన్ 9న సరా, జోసియా మూర్ల కూతురు మేరీ కేథరిన్(10) తన స్నేహితురాళ్లు అయిన మే,లిన స్టిలింగర్లను ఆ రాత్రి తమ ఇంట్లో ఉండి ఆడుకోవడానికి రమ్మని పిలిచింది. అదే రోజు సారా ఒక చర్చ్ లో చిన్న పిల్లల ప్రోగ్రాం ఏదో నిర్వహిస్తుండడంతో మూర్స్ కుటుంబం మరియు మే,లిన స్టిలింగర్లు కూడా ఆ రాత్రి చర్చ్ కి వెళ్ళారు.

అలా మూర్స్ కుటుంబం చాలా సేపటి వరకు చర్చ్ లోనే గడిపిన తరువాత రాత్రి సుమారు 10 గంటల సమయంలో తిరిగి ఇంటికి చేరుకున్నారు.మేరీ స్నేహితురాళ్లు కూడా ఆ రాత్రి వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయారు. ఎప్పుడూ త్వరగా లేచి వారి పనులు చేసుకుంటూ వాళ్ళ పక్కింటి మేరీ పెకంను పలకరించే మూర్స్ కుటుంబం మరుసటి రోజు ఉదయం ఏడైనా బయటకి రాలేదు.

ఎంత సేపైనా వాళ్ళ కుటుంబం బయటకి రాకపోయే సరికి అనుమానం వచ్చిన మేరీ పెకం మూర్స్ తలుపు కొట్టడం మొదలు పెట్టింది. ఎంత సేపు తలుపు కొట్టినా ఎవరూ పలకక పోవడంతో ఎదో జరిగిందని అనుమానించిన మేరీ జోసియా బి తమ్ముడు అయ్యిన రాస్ మూర్ కు తెలియ చేసింది.

రాస్ కూడా అక్కడికి వచ్చి తలుపు కొట్టడం మొదలు పెట్టాడు కానీ లోపల నుంచి ఏ మాత్రం ఉలుకు పలుకు లేదు. దాంతో రాస్ తన దగ్గర ఉన్న ఇంకో తాళం చెవితో తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాడు.

అలా లోపల గెస్ట్ రూంలోకి వెళ్లిన రాస్,మేరీ పెకంలు మే,లిన స్టింగర్లు వంటి నిండా రక్తంతో చనిపోయి ఉండడం చూసి భయపడి వెంటనే పోలీసులకు తెలియచేశారు.

పోలీసులు వచ్చి ఇల్లు మొత్తం వెతికి చూసిన తరువాత మూర్స్ కుటుంబం కూడా చనిపోయారని చెప్పి అక్కడ ఇంట్లో 6 పిల్లలు,2 పెద్ద వాళ్ళు మొత్తం 8 ఎనిమిది మంది ఒక గొడ్డలితో హత్యకు గురైనట్టుగా కేసును నమోదు చేశారు.

చాలా మంది డిటెక్టివ్లు, పోలీసులు ఈ హత్య కేసును చేదిద్దాం అని ప్రయత్నించినప్పటికీ వాళ్ళు గోరంగా విఫలమయ్యారు. అసలు వాళ్ళని ఎవరూ చంపారు?ఎందుకు చంపారు? అన్నది ఎవరికీ తెలియలేదు.

ఆ ఇల్లు మ్యూజియం సొంతం

మూర్స్ కుటుంబం హత్యకు గురై చనిపోయిన తరువాత వాళ్ళ ఇల్లు చాలా కాలం చేతులు మారుతూ వచ్చినా భయంతో ఎవరూ అక్కడ ఎక్కువ కాలం ఉండలేక పోవడంతో 1994లో ఆ ప్రాంతంలోని మ్యూజియంకు చెందిన వాళ్ళు ఆ ఇల్లును సొంతం చేసుకున్నారు.

ఆ ఇల్లును బాగుచేపించి “విల్లిస్కా యాక్స్ మర్డర్ హౌజ్” (villisca axe murder house) అని పేరు పెట్టి దాన్ని ఒక పర్యాటక ప్రదేశంగా మార్చేశారు. మరింత ఆశ్చర్య పరిచే విషయం ఏంటంటే ఆ ఇంట్లో పర్యాటకలు ఒక రాత్రి ఉండొచ్చట.

కానీ అలా ఉండాలంటే 400$ డాలర్లు మ్యూజియం వారికి చెల్లించాల్సి ఉంటుందట.అంటే ఆ సమయంలో మన భారత దేశ డబ్బుల ప్రకారం దాదాపుగా 35 వేలా రూపాయలన్నమాట.

మూర్స్ కుటుంబం హత్య కేసైతే ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు కానీ మ్యూజియం వారికి మాత్రం ఆ ఇల్లు బాగానే ఉపయోగపడుతుంది.ఒకరి దురదృష్టం మరొకరి అదృష్టం అంటే ఇదేనేమో..

also read news:

viral video : నాన్న పుట్టిన రోజున.. డ్రీమ్‌ బైక్‌ గిఫ్టుగా ఇచ్చిన కుమారుడు.. చూస్తే కన్నీళ్లు ఆగవు!

H1B Visa: అమెరికాలో భారతీయుల యాతన.. ఉద్యోగాల తొలగింపులో కొత్తకోణం!

Exit mobile version