HomeinternationalSouth Korea : వామ్మో పెళ్లా.. మాకొద్దు బాబోయ్‌.. దక్షిణ కొరియాలో వింత పరిస్థితి..!

South Korea : వామ్మో పెళ్లా.. మాకొద్దు బాబోయ్‌.. దక్షిణ కొరియాలో వింత పరిస్థితి..!

Telugu Flash News

South Korea news : పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు పెద్దలు. మనదేశంలో పెళ్లికాని మగవారు, ఆడవాళ్లు చాలా మందే ఉన్నారు. పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారు కూడా చాలా మందే ఉన్నారు. దక్షిణ కొరియాలో వింత పరిస్థితి తలెత్తింది. అక్కడ రికార్డు స్థాయిలో పెళ్లంటేనే అబ్బాయిలు జడుసుకుంటున్నారు.

పెళ్లి అనే మాట వస్తేనే ఆమడ దూరం పారిపోతున్నారు. ఎప్పుడూ లేనంతగా దక్షిణకొరియాలో రికార్డు స్థాయిలో పెళ్లిళ్ల సంఖ్య తగ్గిపోయింది. ఆ దేశంలో జననాల రేటు ప్రపంచంలోనే అతి తక్కువగా ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో జనాభా స్వరూపం మారిపోతోందని ఆందోళన వ్యక్తమవుతోంది.

ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడం, ఉద్యోగాలు చేసే మహిళలు ఇంటి పనుల భారాన్ని ఇష్టపడకపోవడం ఇంకా ఇతర కారణాల వల్ల పెళ్లిళ్లు చేసుకొనే వారి సంఖ్య గణనీయంగా పడిపోతోందని నిపుణులు చెబుతున్నారు. 2022 ఏడాదిలో 1,92,000 జంటలు పెళ్లి చేసుకున్నట్లు తాజాగా విడుదలైన గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

2012లో జరిగిన పెళ్లిళ్లతో పోలిస్తే 2022లో 40 శాతం వివాహాలు తగ్గిపోయాయని తేలింది. 2012లో 3,27,000 వివాహాలు జరిగాయి. దక్షిణ కొరియా ప్రభుత్వం ఆ దేశంలో వివాహాలను నమోదు చేయడం 1970 నుంచి మొదలు పెట్టింది. నాటి నుంచి చూస్తే 2022లో అతి స్వల్ప సంఖ్యలో వివాహాలు జరిగినట్లు తేలింది.

ఇక దక్షిణ కొరియాలో వివాహం చేసుకొనే పురుషుల సగటు వయసు 33.7 ఏళ్లు అని గణాంకాల ప్రకారం తేలింది. ఇదే అంశంపై స్త్రీల విషయానికి వస్తే.. 31.3 సంవత్సరాలని వెల్లడైంది. సుమారు దశాబ్దం క్రితంకంటే పురుషులు సగటున 1.6 ఏళ్లు ఆలస్యంగా, స్త్రీలు 1.9 సంవత్సరాలు ఆలస్యంగా వివాహాలు చేసుకుంటున్నారు.

గత ఏడాది వివాహం చేసుకున్న జంట్లో సుమారు 80 శాతం మందికి అది వారి తొలి వివాహం అని స్పష్టమైంది. ఇక దక్షిణ కొరియాలో జననాల రేటు సైతం అత్యల్పంగా నమోదైంది. గత ఏడాది కేవలం 2,49,000 మంది శిశువులు జన్మించారు.

-Advertisement-

జననాల రేటును గణనీయంగా పెంచేందుకు అక్కడి ప్రభుత్వం 2006 నుంచి 213 బిలియన్‌ డాలర్లను వెచ్చించింది. అయినా 2067 నాటికి దక్షిణ కొరియా జనాభా 5 కోట్లా 20 లక్షల నుంచి 3 కోట్ల 90 లక్షలకు పడిపోతుందని అంచనా వేస్తున్నారు. జనాభా సగటు వయసు 62 ఏళ్లు ఉంటుందని తాజాగా విడుదల చేసిన స్టాటిస్టిక్స్‌ స్పష్టంచేస్తున్నాయి.

ఇక పెళ్లిళ్లు, జననాల తగ్గుదలపై అనేక కారణాలను నిపుణులు పేర్కొంటున్నారు. పిల్లల పెంపకానికి సంబంధించి, వివాహం ఖర్చులు, సంసారం ఖర్చులు, అద్దెలు విపరీతంగా పెరిగిపోవడం, మంచి జీతం వచ్చే ఉద్యోగాలు సంపాదించేందుకు సమయం పడుతుండడం.. ఇలా అనేక రకాలుగా తడిసి మోపెడవుతుండడంతో యువత పెళ్లిళ్లపై మక్కువ చూపడం లేదని తెలుస్తోంది.

also read :

Prabhas: చికిత్స కోసం ఫారిన్‌కి ప‌య‌న‌మైన ప్ర‌భాస్… అస‌లేమైంది..!

Chiranjeevi: ఎంత గొప్ప మ‌న‌సు.. త‌మిళ విల‌న్ ఆరోగ్యం కోసం రూ.45ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసిన చిరంజీవి

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News