sonam kapoor : సినీ పరిశ్రమలోని నటీనటుల మధ్య గాసిప్‌లు, రూమర్లు చెక్కర్లు కొడుతుంటాయి. అవి వారి వ్యక్తిగత జీవితంలోనూ, వృత్తిపరంగానూ నష్టాన్ని కలిగిస్తాయి. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ అయిన సోనమ్ కపూర్ ఎన్నో హిట్ సినిమాల్లో నటించి నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకుంది. బాలీవుడ్లో ప్రముఖ పాత్రల్లో నటిస్తూ.. అందరి ప్రశంసలు అందుకున్న ఈ బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తన చేదు అనుభవాలను పంచుకుంది.
సినీ పరిశ్రమలోని పలువురు తారలు తమ చేదు జ్ఞాపకాలను పంచుకుంటున్నారు. ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు, బయటి నుంచి వేధింపులకు గురైన వారు చాలా మంది ఉన్నారు. మహిళలపై వేధింపులు అప్పుడూ, ఇప్పుడూ అనే తేడా లేదు. స్టార్స్ కాదు.. సామాన్యులు కాదు.. జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఈ వేధింపులకు గురయ్యారు . ఇలాంటి అనుభవాన్ని చాలా మంది స్టార్ హీరోయిన్లు చాలా ఇంటర్వ్యూలలో చెప్పారు. తాజాగా సోనమ్ కపూర్ కూడా తన చేదు అనుభవాన్ని వెల్లడించింది.
సమాజంలో మహిళలపై వేధింపులు తరచూ జరుగుతున్నాయి. దేశంలో ఏదో ఒక మూలన రోజుకో దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ఎంత టెక్నాలజీ వచ్చినా, ఎంత చదువులు చదివినా కొందరు మాత్రం ఈ విషయంలో అజాగ్రత్తగా ఉంటున్నారు. దీన్ని నియంత్రించేందుకు ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకొస్తున్నా.. అకృత్యాలను మాత్రం ఆపలేకపోతున్నాయి.
ఇలాంటి వేధింపులు సామాన్య మహిళలతో పాటు సెలబ్రిటీలకు కూడా ఎదురవుతున్నాయి. సోనమ్ కపూర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన వేధింపుల గురించి చెప్పింది. ఆమె చెప్పిన షాకింగ్ విషయాలతో అందరూ షాక్ అయ్యారు.
ఒకప్పుడు ఓ వ్యక్తి చేతిలో లైంగిక వేధింపులకు గురైందట. అది కూడా పబ్లిక్‌గా.. ఈ విషయం పై సోనమ్ కపూర్ మాట్లాడుతూ, తన చిన్నతనంలో, పదమూడేళ్ల వయసులో, తన స్నేహితులతో కలిసి సినిమాకి వెళ్లాను. థియేటర్లో ఇంటర్వెల్ టైమ్‌లో స్నాక్స్ కోసం బయటకు రాగా… ఒక్కసారిగా వెనుక నుంచి ఓ వ్యక్తి వచ్చి గట్టిగా పట్టుకున్నాడు. ఆమె ఛాతీపై చేతులు వేసి గట్టిగా నొక్కాడు.
అకస్మాత్తుగా ఇలా జరగడంతో వణుకు పుట్టిందని చెప్పింది. ఏం జరుగుతుందో తెలియక ఏడ్చేశానని చెప్పింది. అయోమయ వాతావరణం నెలకొందని… తనకే కాదు.. చాలా మంది మహిళలను ఇలా వేధిస్తున్నారని సోనమ్ చెప్పింది. ఈ విషయంలో ఇంకా కఠిన చట్టాలు రావాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
read more :
Sonam kapoor Profile, Photos, Images, Stills 2023
Nikki Tamboli Hot Photos 09.06.2023 | CULTURED WEDDING MAGAZINE