Telugu Flash News

Cyber Crime | అమాయకులపై ఆన్‌లైన్ మోసాలు | సైబర్ నేరాల బారిన పడకుండా ఉండటానికి కొన్ని చిట్కాలు

cyber crime

cyber crime

సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో చాలామంది సైబర్ నేరాలకు (Cyber Crime) బలవుతున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అంటూ ఆశ చూపే సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా సైబర్ నేరాల సంఖ్య పెరుగుతూనే ఉంది.

తాజాగా, చైనాకు చెందిన సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ ఖాతాలను అందించిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతికి చెందిన శిరీష్ కుమార్ అనే వ్యక్తి సోషల్ మీడియా, వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా ప్రజలను సంప్రదించి, ఆన్‌లైన్‌లో ఉత్పత్తులకు రేటింగ్ ఇవ్వడం, ప్రకటనలు చేయడం లాంటి పనులకు డబ్బు ఇస్తామని మోసం చేశాడు.

సుమారు 60 లక్షల రూపాయలను సైబర్ నేరగాళ్లకు బదిలీ చేసిన శిరీష్, వారితో కుమ్మక్కయి కమిషన్ కూడా పొందాడు. ఒకే రోజులో ఒకే ఖాతాలో 1.5 కోట్లు కొట్టేసిన ఈ ముఠాపై దేశవ్యాప్తంగా అనేక కేసులు నమోదయ్యాయి.

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాల పేరుతో ఆన్‌లైన్‌లో వచ్చే ప్రకటనలను ఎవరూ నమ్మకూడదని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ మోసపోతే ధైర్యం కోల్పోకుండా వెంటనే సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.

సైబర్ నేరాల బారిన పడకుండా ఉండటానికి కొన్ని చిట్కాలు:

 

Exit mobile version