HomecinemaRenu desai : రేణు దేశాయ్ ఒక్క మాట అని ఉంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ జైలుకి వెళ్లేవాడు..

Renu desai : రేణు దేశాయ్ ఒక్క మాట అని ఉంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ జైలుకి వెళ్లేవాడు..

Telugu Flash News

Renu desai:రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్ విడాకులు తీసుకుని దాదాపు 10 ఏళ్ళు గడుస్తున్నా కూడా ఇద్ద‌రికి సంబంధించి ఏదో ఒక విష‌యం నెట్టింట చ‌ర్చ‌నీయాంశం అవుతూనే ఉంటుంది.అయితే తాజాగా రేణూకి పాజిటివ్‌గా సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమారి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌గా, ఈ వీడియోని రేణూ త‌న సోష‌ల్ మీడియా పేజ్‌లో షేర్ చేస్తూ..ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది.

వీడియోలో రేణు దేశాయ్.. నాకు కొడుకు పుట్టింది సహజీవనం వల్ల కాదు అని.. ఏ గుడిలోనో, ఇంకెక్కడో పవన్ కళ్యాణ్ నన్ను పెళ్లి చేసుకున్నారు అని స్టేట్మెంట్ క‌నుక‌ ఇచ్చి ఉంటే పవన్ కి జైలు శిక్ష పడేది అంటూ కృష్ణ కుమారి సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ వీడియో రేణు దేశాయ్ షేర్ చేస్తూ.. ఈవిడ ఎవరో నాకు తెలియదు.. నా గురించి ఎందుకుమాట్లాడుతున్నారో కూడా తెలియదు.. కానీ తొలిసారి పబ్లిక్ లో నా తరుపున మాట్లాడడం విని చాలా ఏడ్చాను అని పేర్కొంది.

Renu desai : ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల‌పై మ‌రోసారి ఫైర్ అయిన రేణూ దేశాయ్

నేను ఏదైనా మాట్లాడితే ఎదో ఒక పొలిటికల్ పార్టీకి అమ్ముడయ్యాను అని చెబుతుంటారు, ఇది ఎలక్షన్ టైం అని అంటారు.. కానీ ఈ వీడియో చూసిన తర్వాత నా భాద అర్థం చేసుకునే వ్యక్తులు ఉన్నారనే ధైర్యం నాకు వచ్చింది అంటూ రేణు దేశాయ్ పోస్ట్ చేయడం మరింత చర్చనీయాంశంగా మారింది. రేణు దేశాయ్ చేసిన ఈ పోస్ట్ తో పవన్ వ్యక్తిగత జీవితం గురించి మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది.

 

View this post on Instagram

 

A post shared by renu desai (@renuudesai)

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News