Snoring : పడుకునేటప్పుడు పక్కనే పడుకున్నవారు గురక పెడుతుంటే ఆ సమస్య అంతా ఇంతా కాదు. గురక పెట్టేవారి పక్కన పడుకోవడం వల్ల వారికి నిద్ర పట్టదు. ఈ క్రమంలో ప్రశాంతమైన నిద్రకు భంగం కలుగుతుంది. అయితే కింద పేర్కొన్న చిట్కాలను పాటిస్తే గురక సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు. మరియు ఆ చిట్కాలు ఏమిటంటే…
- రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీటిలో ఒకటి లేదా రెండు చుక్కల పెప్పర్‌మింట్ ఆయిల్ మీ నోటిలో వేసుకుని పుక్కిలించాలి.
- కొద్దిగా పిప్పరమెంటు నూనెను వేళ్లకు రాసుకుని వాసన చూస్తే గురక తగ్గుతుంది.
- అర టీస్పూన్ తేనె, అర టీస్పూన్ ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి రాత్రి పడుకునే ముందు తాగితే మంచి ఫలితం ఉంటుంది.
- మరుగుతున్న నీటిలో 4-5 చుక్కల యూకలిప్టస్ ఆయిల్ వేసి, పడుకునే ముందు ఆవిరి పట్టాలి. దీంతో గురక సమస్య నుంచి బయటపడవచ్చు.
- ఒక గ్లాసు వేడి నీటిలో అర టీస్పూన్ యాలకుల పొడిని కలిపి రాత్రి పడుకునే ముందు తాగితే మంచి ఫలితం ఉంటుంది. గురక సమస్య తగ్గుతుంది.