HomecinemaRashmika : పుష్ప సినిమా లోని 'సామి సామి' పాటను షేర్ చేసిన అమెరికన్ రాపర్ స్నూప్ డాగ్..రష్మిక మందన్న రియాక్షన్ ఏంటి ?

Rashmika : పుష్ప సినిమా లోని ‘సామి సామి’ పాటను షేర్ చేసిన అమెరికన్ రాపర్ స్నూప్ డాగ్..రష్మిక మందన్న రియాక్షన్ ఏంటి ?

Telugu Flash News

Rashmika: కన్న‌డ బ్యూటీ ర‌ష్మిక క్రేజ్ రోజురోజుకి పెరుగుతూ పోతుంది. ఛ‌లో సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్‌గా మారింది. ‘పుష్ప: ది రైజ్’ చిత్రంలో అల్లు అర్జున్‌తో క‌లిసి చేసిన సంద‌డి అంత ఇంత కాదు.

పుష్ప సినిమాతో అల్లు అర్జున్, రష్మిక రేంజ్ మరో స్థాయికి చేరిందనే చెప్పాలి. పుష్ప సినిమాలోని డైలాగ్స్‌, పాటలు ఇప్ప‌టికీ మారుమోగిపోతూనే ఉన్నాయి.

ఈ ఏడాది పుష్ప చిత్రం పాటలు, డైలాగ్స్ సోషల్‌ మీడియాను షేక్ చేశాయి అనే విష‌యం తెలిసిందే. ముఖ్యంగా ‘తగ్గేదేలే’ అనే డైలాగ్‌, ‘సామి సామి’ పాట యువతని కాకుండా ముసలాళ్లను కూడా తెగ‌ఆకట్టుకున్నాయి.

ర‌ష్మిక (rashmika) మానియా..

మన దేశంలోనే కాకుండా వీటికి సంబంధించ ఇతర దేశాల్లో కూడా రీల్స్‌ చేశారంటే పుష్ప క్రేజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికీ ఈ పాటపై రీల్స్‌, డాన్స్ చేస్తూనే ఉన్నారు.

ఇటీవ‌ల ఓ చిన్నారి స్కూల్లో సామి సామి పాటకు అద్భుతంగా డాన్స్ చేసింది. ఈ పాటలో రష్మిక వేసిన హుక్‌ స్టెప్‌ను అచ్చు దించేసి ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది.. మిగతా పిల్లలు మిస్ చేసినా.. తను మాత్రం స్టెప్స్ ఎక్కడా మిస్ కాకుండా అంద‌రిని ఆక‌ట్టుకుంది.

చిన్నారి డాన్స్‌కు ఫిదా అయిన ఓ నెటిజన్‌ 31 సెకండ్ల వీడియోని తన ట్విటర్‌ ఖాతాలో షేర్ చేయ‌గా, తెగ వైర‌ల్ అయింది. అయితే ఈ వీడియో రష్మిక కంట కూడా పడింది.

-Advertisement-

ఈ వీడియోను రష్మిక రీట్వీట్‌ చేసిన ర‌ష్మిక‌.. ఈ చిన్నారి డాన్స్ చూసి నాకు పిచ్చెక్కిపోతుంది అని తెలిపింది. ‘మేడ్‌ మై డే. ఈ క్యూటీని కలవాలనుకుంటున్నా. ఎలా?’ అని నేషనల్ క్రష్ ట్వీట్ చేయ‌గా, ఆ ట్వీట్ కూడా వైర‌ల్ అయింది.

ఇక ఈ చిన్నారి వీడియోని అమెరికన్ రాపర్ స్నూప్ డాగ్ (కాల్విన్ కార్డోజర్ బ్రాడస్ జూనియర్)  త‌న ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. దీన్ని చూసిన రష్మిక మందన్న.. లవ్ ఇట్ అంటూ పోస్ట్‌పై కామెంట్ చేసింది.

 

View this post on Instagram

 

A post shared by snoopdogg (@snoopdogg)

ఇదొక్క వీడియో ర‌ష్మిక పాపులారిటీ ఇత‌ర దేశాలలో కూడా ఏ రేంజ్‌లో ఉందో తెలియ‌జేస్తుంది.

read more news :

Shoaib Akhtar: ఇండియా మా ఆశ‌లపై నీళ్లు చ‌ల్లింది… షోయబ్‌ అక్త‌ర్ షాకింగ్ కామెంట్స్

Myositis : స‌మంత‌కి సోకిన ‘మయోసైటిస్‌’ వ్యాధి ల‌క్ష‌ణాలేంటి ?

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News