Allu Sneha Reddy : తెలుగు వారు ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగలలో ఉగాది ఒకటి. ఫ్యామిలీ అందరు ఈ పండగని ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం ఉగాది వేడుకని ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వైఫ్ స్నేహారెడ్డి తన సోషల్ మీడియాలో ఉగాది వేడుకకి సంబంధించిన వీడియోని షేర్ చేసింది. సాధారణంగా ఆమె గ్లామరస్ ఫోటో షూట్స్ చేయడం, వ్యక్తిగత విషయాలు పంచుకోవడం మనం చూస్తూ ఉన్నాం.
Viral Video : మర్రిచెట్టు వంతెన చూశారా? నది దాటాలంటే సాహసమే!
తాజాగా ఆమె ఉగాది వేడుకల వీడియో షేర్ చేయగా, ఇందులో ఉగాది పచ్చడి ప్రత్యేకంగా తయారు చేయడం మనం గమనించవచ్చు. వాటితో పాటు పులిహోర, గారెలు, పాయసం వంటివి కూడా చేసింది.. పూజ గదిని, ఇంటిని చక్కగా అలంకరించారు. సాంప్రదాయ దుస్తుల్లో పిల్లలను సిద్ధం చేసింది. అయితే స్నేహారెడ్డి ఈ ఉగాది పండుగ అమ్మవాళ్ల ఇంట్లో జరుపుకున్నట్లున్నారు. ఈ వీడియోలో స్నేహారెడ్డి పేరెంట్స్ మాత్రమే కనిపించారు. అల్లు అర్జున్ లే అయితే కనిపించలేదు. బన్నీ పుష్ప2తో బిజీగా ఉండడం వలన స్నేహారెడ్డి తన అమ్మ ఇంటికి వెళ్లినట్టు తెలుస్తుంది.
View this post on Instagram