Sneha: సీనియర్ నటి స్నేహా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తెలుగు స్టార్ హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ.. ఫ్యామిలీ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్ షోకు దూరంగా ఉంటూనే తన నటనతో ఎంతో మంది మనసులని గెలుచుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ వరుస పెట్టి ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. తనదైన శైలిలో క్రేజీ అవుట్ ఫిట్స్ ధరిస్తూ అభిమానులకు ఐఫీస్ట్ కూడా కలిగిస్తోంది. రోజురోజుకు మరింత గ్లామరస్ గా తయారవుతూ వయస్సును తగ్గించుకునే పనిలో ఉంది స్నేహ. అయితే తన పని తాను చేసుకుంటూ పోతున్న స్నేహాకి సంబంధించి ఇటీవల పలు వార్తలు హల్‌చల్ చేసాయి.
గట్టిగా ఇచ్చేసింది..
2009లో వచ్చిన ‘అచ్చముందు’ అనే థ్రిల్లర్ సినిమాలో తొలిసారి ప్రసన్న, స్నేహ జంటగా నటించగా, ఆ తర్వాత వీరిద్దరు ప్రేమలో పడి.. పెద్దల్ని ఒప్పించి రెండేళ్లకే పెళ్లి చేసుకున్నారు. స్నేహ తరచూ ఫ్యామిలీ ఫొటోస్‌ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది. ఇటీవల ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని.. త్వరలోనే విడాకులు కూడా తీసుకోబోతున్నట్లు ప్రచారం జరిగింది. దాంతో స్నేహ ఎట్టకేలకి పూర్త్తి క్లారిటీ ఇచ్చింది. ప్రసన్న చెంపపై ముద్దు పెడుతూ ఓ సెల్ఫీ తీసి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ దానికి‘ట్వినింగ్ వీకెండ్’ అంటూ రాసుకొచ్చింది. దీంతో తమపై పుకార్లు పుట్టించే వారికి అదిరిపోయే సమాధానం చెప్పినట్టైంది.
కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడే స్నేహ నటుడు ప్రసన్నని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెద్దల అంగీకారంతో 11మే, 2012లో వివాహం చేసుకోగా, ఈ దంపతులకి కుమారుడు, కూతురు ఉన్నారు. వీరంతా ఎంతో ప్రేమగా, అన్యోన్యంగా ఉంటుంటారు. తరచూ పిల్లలు, ఫ్యామిలీతో దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంటూనే ఉంటుంది స్నేహ. ఇటీవల తన ఫ్యామిలీ పిక్స్ పెద్దగా షేర్ చేయకపోవడంతో ఇలాంటి ప్రచారాలు మొదలైనట్టు తెలుస్తుంది.
also read news: