Ind vs SA: ఈ మధ్య గ్రౌండ్‌లో పాములు ప్రత్యక్షం కావడం అందరిని కలవరపరుస్తుంది. రీసెంట్‌గా హైదరాబాద్‌లో జరిగిన టీ20లో పాములు వస్తాయని అందరు భయపడ్డారు. కాని అలాంటిదేమి జరగలేదు. గువహటి వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఓ పాము సడెన్‌గా గ్రౌండ్‌లోకి వచ్చేసింది. 7వ ఓవర్ ముగిసిన తర్వాత స్క్వేర్ లెగ్ దిశలో పాము ప్రత్యక్షం కాగా, దానిని సాతాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ పరిశీలించి నిర్వాహకులకి సమాచారం అందించారు. దాంతో మ్యాచ్ కాసేపు ఆగిపోయింది. వెంటనే గ్రౌండ్ లోకి వచ్చిన సిబ్బంది పామును పట్టేసి బయటకు పంపించేశారు.
భయపెట్టిన పాము..
ఇంకా పాము ఎవరికి హాని చేయకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ నెగ్గిన సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో స్పిన్నర్ షమ్సీని పక్కన బెట్టి.. అతడి స్థానంలో పేసర్ ఎంగిడిని తీసుకోగా, భారత్ పంత్‌ని తీసుకొచ్చింది.అయితే టీమిండియాకి ఓపెనర్లు కేఎల్ రాహుల్ 28 బంతుల్లో 57 పరుగులు (5 ఫోర్లు, 4 సిక్సులు), రోహిత్ శర్మ 43 పరుగులు (7 ఫోర్లు, ఒక సిక్స్) మంచి శుభారంభం అందించారు. మొదటి వికెట్‌కి 96 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ద్వారా జట్టు స్కోర్‌కి మంచి పునాది పడినట్టయింది.
ఇక విరాట్ కోహ్లీ 28 బంతుల్లో 48 పరుగులు ( ఏడు ఫోర్లు, ఒక సిక్సర్) , సూర్యకుమార్ యాదవ్ (4×5, 6×5) వీరోచిత ఇన్నింగ్స్ ఆడడంతో భారత్ భారీ పరుగులే చేసింది. సౌతాఫ్రికా ముందు టీమిండియా ఒక భారీ స్కోర్‌ని లక్ష్యంగా నిర్ధేశించగలగగా, దాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన ఓపెనర్ టెంబ బవుమ, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిలీ డకౌట్ అయ్యారు. క్వింటన్ డి \కాక్ 69 పరుగులు (48 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులు ) చేయగా ఐడెన్ 19 బంతుల్లో 33 పరుగులు చేశాడు. అనంతరం డేవిడ్ మిల్లర్ మ్యాచ్ ఫలితాన్ని మా్ర్చేశాడు. 47 బంతుల్లోనే 106 పరుగులు (8 ఫోర్లు, 7 సిక్సులు) బాదినప్పటికీ.. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 221 పరుగులకే పరమితం కావడంతో మ్యాచ్ ఓడిపోయింది.
Snake spotted in india vs sa match. #PakvsEngland2022#INDvsSA pic.twitter.com/FFUDYbD7tI
— Ehtisham_Ejaz 🇵🇰 (@Hitmayn51) October 2, 2022