Homeviral newsViral Video: ఒళ్లు గ‌గుర్పొడిచే వీడియో.. కొద్దిలో పెద్ద ప్ర‌మాదం నుండి త‌ప్పించుకున్న స్నేక్ క్యాచ‌ర్

Viral Video: ఒళ్లు గ‌గుర్పొడిచే వీడియో.. కొద్దిలో పెద్ద ప్ర‌మాదం నుండి త‌ప్పించుకున్న స్నేక్ క్యాచ‌ర్

Telugu Flash News

Viral Video: సాధారణంగా పాముల‌ని చూస్తే ఎవ‌రికైన ఒళ్లు గ‌గుర్పాటుకి గుర‌వ్వ‌డం స‌హ‌జ‌మే. పాము క‌నిపిస్తే ఎవ‌రైన స‌రే కిలో మీట‌ర్ల దూరం పరిగెడతారు. అదే రాచ‌నాగుల‌ని చూస్తే ఇంక అంతే. సోష‌ల్ మీడియా ప్రాముఖ్య‌త పెరిగిన‌ప్ప‌టి నుండి పాముల‌కి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి.

కొంద‌రు అయితే ఈ వీడియోల‌ని చూసి అవాక్క‌వుతున్నారు. అయితే, నెట్టింట వైరల్ అయ్యే వాటిల్లో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని భయంకరంగా ఉంటాయి.

అదృష్టం బాగుంది..

సాధార‌ణంగా పాముకి సంబంధించిన‌ వీడియో కొద్ది క్ష‌ణాల‌లోనే నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది.తాజాగా ఒక వీడియో వైర‌ల్ కాగా, ఈ వీడియోలో పామును పట్టే వ్యక్తికి మంచి గుణపాఠం నేర్పిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఓ స్నేక్ క్యాచర్ ప్రమాదకర కింగ్ కోబ్రా పామును చేతితో పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండడం మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. పాముతో ఏవో ఆట‌లు ఆడుతుండ‌గా, ఆగ్ర‌హానికి గురైన పాము వ్య‌క్తిపై దాడి చేసేందుకు ప్ర‌య‌త్నించింది. ఈ వీడియో నెట్టింట హ‌ల‌చ‌ల్ చేస్తుంది.

ఇక్కడ అదృష్టం ఏంటంటే.. వ్యక్తి పాము కాటు నుండి తృటిలో త‌ప్పించుకున్నాడు. రాచనాగు కాటేస్తే ఎలాంటి వారైన నెల‌కొర‌గ‌డం ఖాయం. అందుకే దాని ద‌గ్గ‌ర‌కు వెళ్లాలంటే భ‌య‌ప‌డుతుంటారు. దానిని పట్టుకునే ముందు ఒకటికి వందసార్లు ఆలోచిస్తారు.

అయితే.. స్నేక్ క్యాచర్ పట్టుకునే సమయంలో దానిని ఆటపట్టించేందుకు ప్రయత్నించాడంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో therealtarzann అనే యూజర్ షేర్ చేయగా.. లక్షలాది మంది ఈ వీడియోని వీక్షించి దానిపై త‌మ అభిప్రాయాన్ని తెలియ‌జేశారు. పాముల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాలంటూ హెచ్చ‌రిక‌లు కూడా పంపుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Mike Holston (@therealtarzann)

-Advertisement-

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News