HomecinemaSmitha: స్మిత టాక్ షో.. సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖుల‌తో.. ఆహాకి పోటీనా.. !

Smitha: స్మిత టాక్ షో.. సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖుల‌తో.. ఆహాకి పోటీనా.. !

Telugu Flash News

Smitha: ఇటీవ‌ల టాక్ షోలోకి డిమాండ్ చాలా పెరిగింది. ఓటీటీలు వ‌చ్చాక అనేక టాక్ షోలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు ఆహాలో అన్‌స్టాప‌బుల్ అనే టాక్ షో స‌క్సెస్ ఫుల్ గా దూసుకుపోతుండ‌గా, దీనికి బాల‌య్య హోస్ట్‌గా ఉన్నారు. రెండు సీజ‌న్స్ పూర్తి చేసుకున్న ఈ షో త్వ‌ర‌లో సీజ‌న్ 3 జ‌రుపుకోనుంది.

అయితే ఇప్పుడు వాటికి మించి అనేలా కొత్త టాక్ షో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. తెలుగు ప్రేక్షకుల్ని సర్ ప్రైజ్ చేయడానికి సింగర్ స్మిత స‌రికొత్త షోతో రాబోతుంది. ‘నిజం విత్ స్మిత’ పేరుతో సోనీ లివ్ లో ఫిబ్రవరి 10 నుంచి కొత్త టాక్ షో స్ట్రీమింగ్ కానుంది.

స్మిత హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ షోకి నారా చంద్రబాబు నాయుడు, చిరంజీవి, నాని, అడివి శేష్, రాధిక, సాయిపల్లవి, అనిల్ రావిపూడి, అల్లరి నరేష్ లాంటి చాలామంది స్టార్స్.. తాజాగా రిలీజైన ప్రోమోలో కనిపించడం విశేషం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని స్మిత.. వెన్నుపోటు టాపిక్ గురించి అడగ్గా.. ‘కేసీఆర్ కూడా భాగమే’ అని చంద్రబాబు అన్నట్లు చూపించారు.

చిరంజీవి తనకు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, ‘సినిమాలో నటిద్దామనా? నీ కులమేంటి?’ అని కొందరు హేళన చేసినట్లు గుర్తుచేశారు. వీటితోపాటు నాని కూడా నెపోటిజం గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ షో కూడా మంచి రంజుగా ఉండేలా క‌నిపిస్తుంది.

also read:

Gautam Adani : అదానీ పతనం ఎక్కడిదాకా? బిలియనీర్ల లిస్టులో 22వ ప్లేస్‌కు పడిపోయిన గౌతమ్‌ అదానీ

-Advertisement-

Pawan Kalyan: మూడు పెళ్లిళ్లు చేసుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ్ర‌హ్మ‌చారిగా ఉండాల‌నుకున్నాడా..!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News