Viral Video: సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయిన తర్వాత.. ప్రపంచంలోని చాలా విషయాలు తెగ వైరల్ అవుతున్నాయ. ప్రకృతి, మనుషులు, జంతువులు ఇలా పలు రకాల విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా, వాటిని చూసి నెటిజన్స్ మైమరచిపోతున్నారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో అందరి హృదయాలు కదిలిస్తుంది. ఈ వీడియోలో ఓ బాలుడు చుడ్వా అమ్ముతుండగా, ఇంత చిన్న వయస్సులో ఈ చిన్నారి కష్టాన్ని చూసి అందరు ఎమోషనల్ అవుతున్నారు..
ఎంత కష్టం వచ్చింది..
బాలుడు భుజానికి ఓ బాక్స్ తగిలించుకుని అందులో పల్లీలు, బియ్యపు పాలాలు, నిమ్మకాయ, పలు రకాల పదార్థాలు పెట్టుకొని ఆ చుడ్వాని రోడ్డుపైకి వచ్చి అమ్ముతున్నాడు. ఇలాఆ చిన్నారి చుడ్వా అమ్ముతుండగా,అందుకు సంబంధించిన వీడియోని తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఇది అందరిని కదిలించింది. బడికి వెళ్లి పుస్తకం పట్టుకోవాల్సిన చేతులు.. రోడ్డుపై చుడ్వా అమ్ముతుండడం అందరిని భాదిస్తుంది. . “చదువుకోవడానికి లేదా సంపాదించడానికి, మనసు నిర్ణయించేది కడుపు కాదు.ష అంటూ ఓ నెటిజన్స్ కామెంట్ పెట్టాడు.
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోకు ఇప్పటి వరకు 19 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి చిన్నోడు అమ్మడం కాదు చదువుకోవాలి అని, ఇది ఎక్కడ అని, చిన్న చేతులతో పెద్ద పనులు చేస్తున్నాడని, దాతలు ఎవరైన ఉంటే వారికి సాయం చేయాలంటూ కొందరు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఎవరికి రావొద్దు అంటూ ఎమోషనల్‌గా స్పందిస్తున్నారు.
पढ़ा जाए या कमाया जाए,
ये दिमाग़ नहीं पेट तय करता है।~ अम्बष्ठ pic.twitter.com/Yn5fCdGyJD
— उम्दा_पंक्तियां (@umda_panktiyan) September 30, 2022