HomesportsSKY: కిందపడుతూ, మీద ప‌డుతూ ఆ షాట్స్ సూర్య ఎలా ఆడ‌గ‌లుగుతున్నాడు...సీక్రెట్ చెప్పిన స్కై

SKY: కిందపడుతూ, మీద ప‌డుతూ ఆ షాట్స్ సూర్య ఎలా ఆడ‌గ‌లుగుతున్నాడు…సీక్రెట్ చెప్పిన స్కై

Telugu Flash News

SKY: డివిలియ‌ర్స్ త‌ర్వాత స్టేడియం మొత్తం అల‌వోక‌గా షాట్స్ ఆడగ‌ల క్రికెట‌ర్ సూర్య కుమార్ యాదవ్.టీ 20ల‌లో అద్భుత‌మైన బ్యాటింగ్ చేస్తూ బౌలర్స్ గుండెల‌లో వ‌ణుకు పుట్టిస్తుంటాడు. ఇటీవ‌ల శ్రీల‌కంతో జ‌రిగిన మూడో టీ20 మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ హైలైట్‌గా నిలిచింది. 200పైగా స్ట్రైక్ రేటుతో లంక బౌలర్లపై విరుచుకుపడిన అతను ఎడాపెడా బౌండరీలు బాదేశాడు. కేవలం 51 బంతుల్లనే 112 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 7 సిక్సర్లు ఉండటం గమనార్హం. మంచి ఇన్నింగ్స్ ఆడిన అతనికే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ క్రమంలో తన ఆట గురించి సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

మ్యాచ్ కోసం సన్నద్ధమయ్యే క్రమంలో మనల్ని మనం ఒత్తిడికి గురి చేసుకోవడం ఎంతో అవ‌స‌రం అని చెప్పాడు. భారీ స్కోర్ చేయడం వెనుక ఎంతో శ్రమ ఉంటుంది. నాణ్యమైన ప్రాక్టీస్ సెషన్లు ఉంటాయని స్కై తెలిపాడు. వెనుకవైపు బౌండరీ లైన్ 59-60 మీటర్ల దూరంలోనే ఉంటుంది. అందుకే ఆ వైపు షాట్లు ఆడేందుకు ప్రయత్నించాను. కొన్ని షాట్లను ముందే అనుకొని ఆడాను. కానీ అదే సమయంలో వేరే షాట్లు ఆడేందుకు కూడా సిద్ధంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది అని సూర్య తెలిపాడు. హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని. ఇది తన సహజ ఆట ఆడేందుకు సహకరిస్తోందని మిస్టర్ 360 చెప్పుకొచ్చాడు.

‘చాలా సందర్భాల్లో గ్యాప్‌లను గుర్తించడానికి ఎంతో ప్రయత్నిస్తాను. ఫీల్డింగ్ సెటప్‌ను అడ్వాంటేజ్‌గా తీసుకుంటాను. నీ ఆటను నువ్వు ఆస్వాదించమని ద్రావిడ్ చెబుతారు’ అని సూర్య చెప్పుకొచ్చాడు. శ్రీలంకపై శతకం పూర్తి చేసుకున్న సూర్య.. టీ20ల్లో వేగంగా 1500 పరుగులు చేసిన ఆటగాడిగా కొత్త‌ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇప్పటి వరకూ 45 అంతర్జాతీయ టీ20లు ఆడిన ఈ ముంబై క్రికెటర్ 46.61 యావరేజ్‌, 180.34 స్ట్రైక్ రేట్‌తో 1578 పరుగులు చేసి వావ్ అనిపించాడు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News