Summer Skin Care: ఎండా కాలంలో చెమట, డీహైడ్రేషన్, అధిక వేడి సాధారణమే. దీంతో చర్మం చాలా చికాకుగా అనిపిస్తుంది. వేసవి కాలంలో చర్మాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేదంటే దద్దుర్లు, టానింగ్, మొటిమలు, మెలస్మా, సన్ అలర్జీలు వస్తాయి. ఎండ ఉన్నా లేకపోయినా సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం మంచిది. ఇది దీర్ఘకాలంలో అనేక చర్మ సమస్యలను తగ్గింస్తుంది.
heart health : భవిష్యత్తు లో గుండెపోటు రాకుండా ఉండేందుకు పిల్లల జీవనశైలిలో ఎలాంటి మార్పులు చేయాలి ?
సూర్యుని హానికరమైన UV కిరణాల వల్ల చర్మం దెబ్బతింటుంది. దీని వల్ల శరీరంపై మచ్చలు పడి ముడతలు వస్తాయి. దీని నుంచి బయటపడాలంటే తప్పనిసరిగా సన్ స్క్రీన్ రాసుకోవాలి. ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇది రాసుకుంటేనే చర్మం తేమని కోల్పోకుండా నిగారింపు సంతరించుకుంటుంది.
వేసవిలో మాయిశ్చరైజింగ్ క్రీమ్ వాడటం వల్ల చర్మంలోని నీటి కంటెంట్‌ను పోకుండా కాపాడుతుంది. చర్మాన్ని మృదువుగా ఉంచడంలో మాయిశ్చరైజింగ్ క్రీమ్ కీలక పాత్ర పోషిస్తుంది. తేమ లేకపోవడం వల్ల కూడా చర్మం జిడ్డుగా ఉంటుంది.
Dry Fruits Health Benefits : పోషకాలకు నిలయం డ్రై ఫ్రూట్స్
ఎండలో వెళ్లేటప్పుడు చర్మాన్ని రక్షించుకోవడానికి ఎక్కువగా మేకప్ ధరించడం మంచిది కాదు. నీళ్లు ఎంత తాగితే అంత మంచిది. వేసవిలో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో హైడ్రేషన్ కీలకం.