HomecinemaSitara: నాన‌మ్మ లేర‌ని తెలిసి వెక్కి వెక్కి ఏడ్చిన సితార‌.. ఓదార్చిన మ‌హేష్‌

Sitara: నాన‌మ్మ లేర‌ని తెలిసి వెక్కి వెక్కి ఏడ్చిన సితార‌.. ఓదార్చిన మ‌హేష్‌

Telugu Flash News

Sitara:మ‌హేష్ బాబు త‌ల్లి ఇందిరా దేవి ఈ రోజు ఉద‌యం అనారోగ్యంతో క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. ఇందిరా దేవి మ‌ర‌ణంతో ఘ‌ట్ట‌మ‌నేని ఇంట విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. కృష్ణతో పాటు మహేష్‌ బాబు ఇతర కుటుంబ సభ్యులు దు:ఖంలో మునిగిపోయారు.

ఈ విషాద వార్త తమను కలచివేసిందంటూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా తమ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. అయితే ఇందిరా దేవి మృతితో కృష్ణ‌, మ‌హేష్ బాబు తీవ్ర దుఃఖంలో మునిగి ఉండ‌గా, నాన్మ‌మ్మ మృతిని త‌ట్టుకోలేని సితార కూడా ఏడ్చేసింది.

త‌ట్టుకోలేక‌పోయింది..

తండ్రి ఒళ్లో కూర్చిని నాన్నమ్మ‌ని త‌ల‌చుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. ఈ స‌న్నివేశం ప్ర‌తి ఒక్కరికి క‌ల‌చివేసింది. సితార‌కి నాన్న‌మ్మ‌తో మంచి బాండింగే ఉంది. సెల‌వుల‌లో అప్పుడ‌ప్పుడు నాన్న‌మ్మ ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఆమెతో గ‌డిపి వ‌స్తుంటారు.

ఇక చిరంజీవి సైతం ఇందిరా దేవి మృతితో ఎమోష‌న‌ల్ అవుతూ త‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా ట్వీట్ చేశారు. ఇందిరాదేవి గారు స్వర్గస్తులయ్యారనే వార్త ఎంతో కలచివేసింది. ఆ మాతృదేవత ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. సూపర్‌స్టార్‌ కృష్ణ గారికి, సోదరుడు మహేశ్‌బాబుకు, కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని పేర్కొన్నారు.

-Advertisement-

ఘట్టమనేని కృష్ణ గారి సతీమణి, ఘట్టమనేని మహేష్‌ బాబు మాతృమూర్తి ఇందిరాదేవి గారి మరణం బాధాకరం. ఇందిరాదేవి గారు లేకపోవడం కృష్ణగారి కుటుంబానికి తీరని లోటు. ఇందిరాదేవి గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

గత కొంతకాలంగా వయోసంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇందిరాదేవి ఈ రోజు ఉదయం 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆమె అంతిమ సంస్కారాలను హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో జ‌ర‌పనున్నారు.

Mahesh Babu: కృష్ణ కుటుంబంలో వ‌రుస మర‌ణాలు.. మూడేళ్లలో ముగ్గురు..!

Mahesh Babu mother : మ‌హేష్ బాబు త‌ల్లి ఇందిరా దేవి క‌న్నుమూత‌..సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News