HomecinemaSinger Sunitha : సంస్కారం ఉంటే అలా మాట్లాడ‌రు.. క‌డిగి పారేసిన సింగ‌ర్ సునీత‌

Singer Sunitha : సంస్కారం ఉంటే అలా మాట్లాడ‌రు.. క‌డిగి పారేసిన సింగ‌ర్ సునీత‌

Telugu Flash News

Singer Sunitha : తెలుగు సినీ ప్రియుల‌కి ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు సునీత‌. న‌టిగా, యాంక‌ర్ గా, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా, సింగ‌ర్‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించింది. చాలా సంప్ర‌దాయ‌బద్ధంగా ఉండే సునీత‌..నో ఎక్స్‌పోజింగ్, నో వల్గారిటి, నో హర్టింగ్ వంటి వాటిని బాగా ఫాలో అవుతుంది.

అయితే త‌న‌ని మ‌రీ విసిగిస్తే మాత్రం రెచ్చిపోయి కామెంట్స్ చేస్తుంది. తాజాగా ఆమె త‌న రెండో పెళ్లి గురించి విమ‌ర్శించే వారికి గ‌ట్టిగా బదులిస్తూ సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. ప్ర‌స్తుతం సునీత కామెంట్స్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

గ‌ట్టిగా ఇచ్చేసింది..

సునీత రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూ ఇచ్చింది.ఇందులో ఓ యాంక‌ర్ .. మీ మీద చాలా ట్రోల్స్ వ‌చ్చాయి, మీ రెండో పెళ్లిపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీని గురించి ఏమంటార‌ని అడ‌గ‌గా, దీనికి స్పందించిన సునీత‌.. మీరు అంద‌రు అంటూ ఉంటారు క‌దా, చిత్ర గారి త‌ర్వాత 121 మంది హీరోయిన్స్ కి డ‌బ్బింగ్ చెప్పింది అని, నేను మిమ్మల్ని ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికే ఉన్నాను.

నా కెరీర్ ప‌రంగా ఎన్నో మంచి విషయాలు ఉండ‌గా, రెండో పెళ్లి గురించే ఎందుకు మాట్లాడుతుంటారు. సంస్కార వంతుల ల‌క్ష‌ణం ఏంటంటే, ఒక మ‌నిషిని ఒక మాట అనేముందు కాస్త ఆలోచించాలి.

అస‌లు విమ‌ర్శ‌లు చేసే వారు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియ‌దు అంటూ ఎమోష‌న‌ల్ అయింది సునీత‌. కాగా, చిన్న‌ప్పుడే సింగర్ సునీత పెళ్లి చేసుకొని ఇద్దరు బిడ్డలకు తల్లి అయింది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆమె తన భర్తకు విడాకులు ఇచ్చి.. ఇటీవ‌ల ఓ మీడియా అధినేతని పెళ్లి చేసుకుంది.

పెళ్లి త‌ర్వాత సోష‌ల్ మీడియాలో యాక్టివ్ అయింది. రెండో పెళ్లి త‌ర్వాత ఆమె పోగొట్టుకున్న సంతోషాల‌న్ని ఒక్కొక్క‌టి ద‌క్కించుకుంటుంది. త‌ను చిన్న వ‌య‌సులో చేయ‌లేని ప‌నులు ఇప్పుడు చేసి సంతోష‌ప‌డుతూ వ‌స్తుంది.

-Advertisement-

మరిన్ని వార్తలు చదవండి :

Sita Ramam: క్లాసిక‌ల్ హిట్ సీతారామంకి సీక్వెల్ ఉంటుందా.. దుల్క‌ర్ ఏమన్నాడు..!

bigg boss telugu season 6 : బిగ్ బాస్ శ్రీస‌త్య‌పై పెరుగుతున్న నెగెటివిటీ.. అందంతో కాదు ఆట‌తో మెప్పించు..!

 

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News