Telugu Flash News

సమంత కి డబ్బింగ్ చెప్పే అవకాశం ఇక రాదేమో : చిన్మయి

samantha and chinmayi

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ సమంత, సింగర్ మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి మంచి స్నేహితులన్న సంగతి అందరికీ తెలుసు. ఇప్పుడు ఒకరినొకరు కలవడం లేదని, వారి మధ్య పుకార్లు వస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చిన్మయి ఈ విషయం పై క్లారిటీ ఇచ్చింది . తాను, సమంత మంచి స్నేహితులమని, మేము కలిసి ఉన్నామనే విషయం తెలియాల్సిన అవసరం లేదన్నారు.

అలాగే ఇంకా చిన్మయి మాట్లాడుతూ.. ‘సమంత చాలా మంచి వ్యక్తి. ఆమె వల్లే నాకు తెలుగులో డబ్బింగ్ ఆర్టిస్ట్‌ని మించిన కెరీర్ వచ్చింది. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఇక సమంత కి చెప్పే అవకాశం రాదేమో, ఎందుకంటే ఇప్పుడు సమంత తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటోంది’ అని అన్నారు.

వారిద్దరి మధ్య సంబంధాలు తెగిపోయాయని వస్తున్న వార్తలపై ప్రశ్నించగా.. అందులో వాస్తవం లేదన్నారు. ‘మేము ఎప్పుడు కలిసినా, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయనంత మాత్రాన మేము విడిపోయామని కాదు.

నా వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవడం నాకు ఇష్టం ఉండదు. మేమిద్దరం తరచుగా కలుస్తుంటాం . పార్టీలకు, డిన్నర్లకు కలిసి వెళ్తుంటాం. ఇద్దరం కలవాలనుకుంటే ఇంట్లో కలుసుకుంటాం ‘ అని వివరించింది.

‘ఏం మాయ చేశావే’ సినిమా నుంచి సమంతకు చిన్మయి డబ్బింగ్ చెబుతున్న సంగతి మనకు తెలుసు. ఏం మాయ చేశావే మూవీ తో సమంత తన నటన, అందం తో ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో , అంతే గుర్తింపు తన డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి కి కూడా తెచ్చిపెట్టింది.

అప్పటి దాకా గాయని గా ఉన్న చిన్మయి సమంత కి డబ్బింగ్ చెప్పడంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. సమంత వల్లే చిన్మయికి తెలుగులో మంచి గుర్తింపు వచ్చిందంటే అతిశయోక్తి కాదు. ఇదే విషయాన్ని ఆమె ఇంటర్వ్యూలో కూడా చాలా సార్లు చెప్పింది.

జవాన్‌ సినిమా కోసం విజయ్ సేతుపతి రెమ్యునరేషన్‌ తెలిస్తే షాకవుతారు..!

బాయ్‌కాట్ ట్రెండ్ పై విక్రమ్ ఫన్నీ రిప్లై

 

Exit mobile version