అందమైన చిరునవ్వు, పలువరుస పరుగులెత్తే వారిని కూడా ఆపేసే శక్తి ఉంది. మనవీ అలా ఉంటే బాగుండు అని అనిపిస్తోంది కదూ.. ఆ మరెందుకు ఆలస్యం? దానిమ్మ గింజల్లాంటి దంతాలు మీ సొంతం కావాలంటే ఈ టిప్స్ పాటించండి..
- బ్రష్ చేసుకోకుండా కాఫీ, టీ త్రాగేవాళ్లు కనీసం గ్లాసుడు నీళ్ళతో నోటిని శుభ్రపరుచుకోవాలి.
- ‘బే’ చెట్టు ఆకుల్ని ఎండబెట్టి వారానికి 2 సార్లు వాటితో పళ్ళు రుద్దితే మీ పళ్ళు నిగనిగలాడుతాయి.
- కాస్త ఉప్పు, కొంచెం బేకింగ్ సోడా కలిపి పళ్ళను తోమితే తెల్లటి మెరుపు మీ సొంతం.
- నిమ్మతొక్కలు, వేపాకులు బాగా ఎండబెట్టి పొడిచేసిన తర్వాత తగినంత ఉప్పు కలిపి పళ్ళను తోమితే గారపట్టిన పళ్ళు కూడా ఫ్రెష్ గా కనిపిస్తాయి.
- నల్ల ద్రాక్షరసంతో పళ్ళను కడుక్కున్నా సరిపోతుంది.
- బ్రెడ్ చుట్టూ ఉన్న అంచులను ఎండబెట్టి వేడిచేసి మిరియం, ఉప్పుపొడి కలిపిన మిశ్రమంతో పళ్ళు తోము కున్నా తెల్లబడతాయి.
- ఉల్లిగడ్డ పేస్టులో 2 తేనెచుక్కలు, కొంచెం నిమ్మరసం కలిపి శుభ్రంగా రుద్దుకుంటే పళ్ళు తెల్లగా మెరుస్తాయి.
- పళ్ళమీద పచ్చటి మరకలుంటే స్ట్రాబెరీ పండును చిదిమి ఆ గుజ్జును రోజూ పళ్ళమీద రాస్తే ఆ మరకలు పోతాయి.
- రాత్రి నిద్రపోయే ముందు, భోజనం అయ్యాక ఆపిల్ పండు తింటే దంతవ్యాధులు పోయి గట్టి చిగుళ్లు ఏర్పడతాయి.
ఇప్పుడు నవ్వుతుంటే అందరూ మీ పళ్ళవరుసనే చూస్తారు. గమనించండి.