మనం తినే ఆహార పదార్థాలలో కల్తీ (adulteration) ని సులభంగా కనిపెట్టవచ్చు. వేరుశెనగ గింజలలో రాళ్ళు ఉంటే ఏరిపారేస్తాం. అన్నీ అలా కనిపించవు. మరి కళ్ళకు కనిపించనివి కనిపెడితే కదా గొప్పతనం. ఆ గొప్పతనం మీకందరికీ రావాలనే..
- తేనెను నీటిలో వేస్తే అది కరిగిపోతే కల్తీ జరిగినట్లు.. కరగకపోతే స్వచ్ఛమైనదే !
- క్యాసియా చెక్క దాల్చిన చెక్క ఒకేలా ఉంటాయి. సువాసనను బట్టి వాటిని వేరు చేసుకోవాలి.
- నేతిని చేతి మీద వేసుకొని బాగా రుద్దితే. ఘాటైన వాసన వస్తే మంచిది.
- పాలలో 2 చుక్కల టించర్ వేస్తే అవి నీలిరంగుగా మారితే కల్తీపాలే !
- ఉప్పు, కర్పూరం ఒక రకంగా ఉన్నా సువాసనతో వేరు చేయవచ్చు.
- టీ డికాషన్లో పాలు పోసినపుడు ఆరెంజ్ కలర్ లోకి మారితే అది కల్తీ టీ పొడిగా, బ్రౌన్ కలర్ లోకి మారితే మంచి టీ పొడిగా భావించాలి.
- రాయి అనుకొని వజ్రాన్ని వదిలేస్తే..లేదులేండి ! వజ్రాన్ని సులభంగా కనిపెట్టవచ్చు. ఒక గ్లాసుడు మంచినీళ్ళలో వేస్తే నీటిలో మెరిస్తే వజ్రం. మెరవకపోతే రాయన్నమాట.
మరిన్ని కల్తీ లేని స్వచ్చమైన వార్తలు చదవండి :
మీకు fridge లేదని బాధపడుతున్నారా? ఈ టిప్స్ మీ కోసమే
Diabetes : మధుమేహ రోగులు ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?
sleeping tips : నిద్ర పట్టడం లేదా ? ఈ 9 చిట్కాలు మీకోసమే..
eye care tips : ప్రపంచ అందాలను చూసే మీ కళ్ళు కాపాడుకోవాలంటే..?