Telugu Flash News

Simbu : ఆమెతో పెళ్లిపీట‌లు ఎక్క‌బోతున్న శింబు.. అవన్నీ రూమర్సేనా ?

simbu marriage news

Simbu : కోలీవుడ్ ల‌వ‌ర్ బోయ్ శింబు త‌మిళ ప్రేక్షకుల‌కే కాదు తెలుగు ప్రేక్ష‌కుల‌కి కూడా చాలా సుప‌రిచితం. ఆయ‌న ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషించి ప్రేక్ష‌కుల మ‌న‌సులు కొల్ల‌గొట్టారు. అయితే సినిమాల‌తో క‌న్నా ప్రేమ వ్య‌వ‌హారంతో శింబు వార్త‌ల‌లో నిలిచాడు. నయ‌న‌తార‌, హ‌న్సిక మొత్వానీల‌తో ఘాటు ప్రేమాయ‌ణం న‌డిపిన ఆయ‌న అనుకోని కార‌ణాల వ‌ల‌న వారికి బ్రేక‌ప్ చెప్పాడు. ఇక శింబు పెళ్లి గురించి కొన్నాళ్లుగా అనేక వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తూనే ఉన్నాయి.

తాజాగా శ్రీలంక‌కు చెందిన పెద్ద వ్యాపార‌వేత్త కుమార్తెతో శింబు పెళ్లి జ‌ర‌గ‌నుంద‌ని టాక్ వినిపిస్తుంది.. ఓ పార్టీలో శింబు బిజినెస్ మ్యాన్ కుమార్తెను క‌లిశార‌ని, ఆ ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింద‌ని అదే ఇప్పుడు ఇద్ద‌రు పెళ్లి పీట‌లెక్కేందుకు దోహ‌దం చేసిన‌ట్టు తెలుస్తుంద‌ని కోలీవుడ్ సినీ ప్రియులు అంటున్నారు.

అయితే.. శింబు మేనేజర్ ఈ విషయం పై ఓ క్లారిటీ ఇచ్చారు.. “కొన్ని మీడియా ఛానెల్‌లు పేర్కొన్నట్లుగా శ్రీలంక తమిళ అమ్మాయితో శింబు నిశ్చితార్థం చేసుకున్న వార్తలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దాని వెనుక వాస్తవం లేదు. పెళ్లికి సంబంధించి ఏదైనా శుభవార్త వచ్చినప్పుడు, మీడియా మిత్రులనే ముందుగా పిలిచి, అదే విషయాన్ని తెలియజేస్తాము ” అని ఓ స్టేట్మెంట్ ఇచ్చారు.

శింబు ప్ర‌స్తుతం పాత్తు త‌ల అనే సినిమాలో న‌టిస్తున్నారు. ఈ సినిమా మార్చి 30న రిలీజ్ అవుతుంద‌నే టాక్ వినిపిస్తుంది.

also read :

bollywood actress Sara Ali Khan Latest Instagram photos 2023

Layoffs : లేఆఫ్స్‌ వేళ గూగుల్‌ మరో కీలక నిర్ణయం.. ఖర్చు తగ్గించుకోవడమే లక్ష్యం!

Adah Sharma Latest Hot Photos, Images, stills 2023

Exit mobile version