Telugu Flash News

Siddharth : ఈ పోస్ట్‌తో అదితితో ప్రేమ‌లో ఉన్న‌ట్టు క‌న్‌ఫాం చేసిన సిద్ధార్థ్‌

Siddharth: ఇటీవ‌ల సినిమా ఇండ‌స్ట్రీలో చాలా మంది సైలెంట్‌గా ప్రేమాయ‌ణం న‌డుపుతూ, పెళ్లి కూడా చాలా సీక్రెట్‌గానే చేసుకుంటున్నారు. మ‌రి ఇందుకు కార‌ణాలేంట‌నేవి మాత్రం తెలియ‌డం లేదు. అయితే స‌మంత‌తో ప్రేమ‌లో ప‌డి ఆ త‌ర్వాత బ్రేక‌ప్ చెప్పిన సిద్ధార్థ్… గ‌త కొద్ది రోజులుగా మ‌హాస‌ముద్రం న‌టి అదితి రావు హైద‌రితో ప్రేమాయ‌ణం న‌డుపుతున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే.

ఈ వార్తలకు వారిద్ద‌రు అవుననలేదు..అలాగని ఖండించనూ లేదు. దీంతో ఇద్దరి మధ్య ఏదో ఉందంటూ ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. అయ‌తే ఎట్టకేలకు ఈ వార్తలకు సిద్ధార్థ్, అదితి రావు హైదరి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

క‌న్‌ఫాం చేసిన‌ట్టేనా..

అదితి పుట్టినరోజు (28 October 1986) సందర్భంగా ఆమెకు ఎంతో స్పెషల్ గా విషెస్ తెలుపుతూ తన ప్రేమ వ్యవహారం నిజమే అని చెప్ప‌క‌నే చెప్పాడు.”నా హృదయ రాకుమారి అదితిరావు హైదరికి హ్యాపీ హ్యాపీ బర్త్ డే.. నీ కలలన్ని నిజం కావాలని కోరుకుంటున్నాను. నా జీవితంలో ఇది బెస్ట్ ట్రిప్..” అంటూ త‌న పోస్ట్‌లో రాసుకొచ్చాడు.

ఇక ఆ ఫోటోలో సైతం సిద్దు ఎదపై వాలిపోయి అదితి కనిపించ‌డంతో వీరిద్ద‌రి మ‌ధ్య ప్రేమ నిజ‌మే అని, ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని టాక్ వస్తోంది.

ఇక సిద్ధు విష‌యానికి వ‌స్తే.. బాయ్స్, బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర కాగా, మ‌నోడు కమర్షియల్ మూవీస్‌కే ఎక్కువ చేశాడు.

కొన్నాళ్లు ముందు శర్వానంద్‌తో కలిసి మహా సముద్రం అనే సినిమాలో యాక్ట్ చేయ‌గా, ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. దీంతో ఆయన ఇప్పుడు తెలుగు సినిమాలపై ఆస‌క్తి చూప‌డం లేదు.

అదితి విష‌యానికి వ‌స్తే.. సమ్మోహనం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు.. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తర్వాత వీ, అంతరిక్షం చిత్రాల్లో న‌టించి అలరించింది. చివరిసారిగా అదితి మహా సముద్రం చిత్రంలో నటించింది.

మరిన్ని వార్తలు చదవండి : 

Bigg Boss 6: కెప్టెన్ అవ్వ‌గానే హౌజ్‌మేట్స్‌ని ర‌ఫ్ఫాడిస్తున్న శ్రీహాన్..!

horoscope today : 29-10-2022 శనివారం ఈ రోజు రాశి ఫలాలు

Exit mobile version