శర్వానంద్ ఎంగేజ్మెంట్ : సినిమా ఇండస్ట్రీలో సీక్రెట్ ప్రేమాయణాలు చాలా సాగుతూనే ఉంటాయి. ఒక్కోసారి అవి బయటపడుతుంటాయి. ఒక్కోసారి చాలా సీక్రెట్‌గా ఉంటాయి. కొద్దిరోజులుగా హీరో సిద్దార్థ్ – అందాల భామఅదితి రావ్ హైదరి ప్రేమలో మునిగితేలుతున్నట్టు ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా శర్వానంద్ ఎంగేజ్ మెంట్ కు వీరిద్దరూ జంటగా హాజరై షాకిచ్చారు.
గతంలో ముంబైలోని ఓ హోటల్ లో ఇద్దరు కలిసి కెమెరా కంటికి చిక్కారు.. ఆ తర్వాత కూడా ఇద్దరు పలు సందర్భాలలో హాట్ టాపిక్‌గా మారారు. ఇలా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నట్టు నెట్టింట పుకార్లు షికారు చేస్తుండగా.. తాజాగా వాటికి బలం చేకూర్చారు.
టాలీవుడ్ హీరో శర్వానంద్ ఎంగేజ్ మెంట్ లో సిద్ధార్థ్- అదితి జంటగా మెరిశారు. శర్వా రక్షితతో ఫొటోలు కూడా దిగారు. కపుల్ లాగే దర్శనమిచ్చారని కొందరు చెబుతుండగా, వీరిద్దరిని ఇలా చూసి ప్రతి ఒక్కరు అవాక్కవుతున్నారు. ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ నిజమేనా? అని షాక్ అవుతున్నారు. త్వరలో అయితే వీరి రిలేషన్‌పై ఒక క్లారిటీ అయితే రానుందని తెలుస్తుంది.
also read:
Sharwanand – Rakshitha reddy Engagement Photos
Sharwanand : శర్వానంద్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి బ్యాక్‌గ్రౌండ్ తెలుసా ?