HomecinemaSiddharth - Aditi ల పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయిన‌ట్టేనా!

Siddharth – Aditi ల పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయిన‌ట్టేనా!

Telugu Flash News

సుధీర్ బాబు నటించిన సమ్మోహనం సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ అదితి రావు హైదరీ (Aditi Rao Hydari) కొన్నాళ్లుగా హీరో సిద్దార్థ్ (Siddharth) తో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ ఇద్దరూ మహాసముద్రం సినిమా నుంచి క్లోజ్ రిలేషన్ షిప్ లో ఉన్నారని , ఆ స‌మ‌యంలో వారి మ‌ధ్య ప్రేమ కూడా పుట్టింద‌ని టాక్. అయితే అదితిరావు హైదరీకి ఇదివరకే పెళ్లి అయ్యింది. సత్యదీప్ మిశ్రాను వివాహం చేసుకున్న అదితి.. కొంతకాలానికి విడాకులు ఇచ్చేసింది.

ఇక సిద్దార్థ్ కి ఇది వరకే వివాహం జరిగింది. 2003లో మేఘన అనే అమ్మాయిని వివాహం చేసుకొని 2007లో ఆమెకు విడాకులు ఇచ్చేసారు.

కొన్నాళ్లుగా సోలోగా ఉంటున్న ఈ ఇద్ద‌రు ప్రేమ‌లో ఉన్నార‌ని టాక్. అన్ స్టాపబుల్ షోలో సిద్దార్థ్ డేటింగ్ లో ఉన్నట్లు హింట్ ఇచ్చారు శర్వానంద్. దీనికి తోడు శర్వానంద్ నిశ్చితార్థానికి వీరిద్దరూ జంటగా వచ్చారు.

Siddharth and aditi rao hydari at sharwanand engagement
siddarth and aditi rao hydari at sharwanand engagement

మ‌రోవైపు అదితి, సిద్దార్థ్ లు పెళ్ళికి సిద్ధమవుతున్నారంటూ వార్తలు వ‌స్తున్నాయి. ఈ క్రమంలో ‘ఇద్దరం రిలేషన్ లో ఉన్న మాట నిజమే గానీ పెళ్లి మా ఇద్దరికీ కలిసి రాలేదు’ అంటూ సన్నిహితుల దగ్గర వెల్లడించినట్లు టాక్. దీంతో వీరిద్ద‌రి పెళ్లిపై సస్పెన్స్ నెల‌కొంది.

also read:

-Advertisement-

నాందేడ్‌ సభ నేడే.. KCR ప్రసంగం ఎలా ఉండబోతోంది?

YCP MLA : కర్నూలుకు వ్యాపించిన అసంతృప్తి సెగ..

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News