Homecinemaకియారాతో ప్రేమ నిజమే..కాఫీ విత్ కరణ్ షో లో సిద్ధార్థ్

కియారాతో ప్రేమ నిజమే..కాఫీ విత్ కరణ్ షో లో సిద్ధార్థ్

Telugu Flash News

బాలీవుడ్‌లో కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రా రొమాన్స్ తరచుగా హాట్ టాపిక్ అవుతుంది. గత కొంత కాలంగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ వార్తలపై ఈ జంట ఎప్పుడూ నేరుగా స్పందించలేదు. తాము స్నేహితులమని చెప్పి పుకార్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. అయినా వీరి ప్రేమ, పెళ్లిపై పుకార్లు ఆగడం లేదు. రీసెంట్‌గా కియారా బర్త్‌డే సెలబ్రేషన్‌లో భాగంగా ఈ జంట దుబాయ్‌కి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ఫోటోలు బయటకు రావడంతో మరోసారి వీరిద్దరి ప్రేమాయణం రూమర్ గా మారింది.

ఈ నేపథ్యంలో ఎట్టకేలకు సిద్ధార్థ్ ఓ షోలో తమ బంధాన్ని బయటపెట్టాడు. కాఫీ విత్ కరణ్ షోకి వచ్చిన సిద్ధార్థ్.. కియారాతో ప్రేమలో ఉన్నట్లు పరోక్షంగా ప్రకటించాడు. ఈ టాక్ షోలో హీరో విక్కీ కౌశల్ తో కలిసి సిద్ధార్థ్ పాల్గొని సందడి చేశాడు. ఈ సందర్భంగా కరణ్, సిద్ధార్థ్ ద్వారా కియారాతో తనకున్న సంబంధాన్ని వెల్లడించే ప్రయత్నం చేశాడు. సిద్ధార్థ్‌ను కెరీర్ ప్లాన్ ఏంటని ప్రశ్నించగా.. హ్యాపీ అండ్ బ్రైట్ లైఫ్ కావాలని సిద్ధార్థ్ చెప్పాడు. ఆపై కియారాతోనా అని  కరణ్ అడగ్గా .. ఆమె తో అయితే లైఫ్ ఇంకా బాగుంటుందని  తన ప్రేమ గురించి సిద్ధార్థ్ చెప్పాడు.

ఈ సందర్భంగా, కరణ్ సిద్ధార్థ్ కోసం కాఫీ విత్ కరణ్ గత ఎపిసోడ్ లోని  కియారా వీడియో క్లిప్‌ను ప్లే చేశాడు. అందులో కియారా ను సిద్ధార్థ్ గురించి అడిగినప్పుడు, మేము స్నేహితుల కంటే ఎక్కువ అని చెప్పింది. పైగా, కరణ్ తన ప్రశ్నలతో కియారాను ఇబ్బంది పెట్టడం చూసి, తనని అన్ని ప్రశ్నలు  ఎందుకు అడిగారు అని అన్నాడు . ఇంతకీ సిద్ధార్థ్‌ను పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అని అడగ్గా.. మీరు  సెటిల్ అయ్యారు .. మేము కావద్దా? ఆయన బదులిచ్చారు. చివరకు తనను పిలవకుండా పెళ్లి చేసుకుంటే కొడతానని కరణ్ సిద్ధార్థ్‌ను హెచ్చరించాడు.

మరిన్ని వార్తలు చదవండి 

మహేష్ బాబు తో మాస్ మసాలా యాక్షన్ మూవీ : త్రివిక్రమ్

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా ‘గాడ్‌ఫాదర్‌’ టీజర్‌

-Advertisement-

ఇండస్ట్రీని ఈ స్థాయిలో ప్రేమిస్తానని అనుకోలేదు : సన్నీలియోన్

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News