Shyamala: టాలీవుడ్ అందమైన ఫిమేల్ యాంకర్స్ లో శ్యామల ఒకరు అనే చెప్పాలి. అచ్చ తెలుగు వనితలాగా కనిపిస్తూ ఉండే శ్యామలకి పెళ్లై పిల్లలు ఉన్నా కూడా తన అందంతో ఆకట్టుకుంటూనే ఉంటుంది.
శ్యామల యాంకరింగ్ మాత్రమే కాకుండా అప్పుడప్పుడూ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా రాణిస్తోంది. బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్ గా మెరిసిన శ్యామల నటుడు నరసింహారెడ్డిని శ్యామల వివాహం చేసుకొని ప్రస్తుతం సంతోషంగావైవాహిక జీవితాన్ని లీడ్ చేస్తున్నారు.
శ్యామల సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ ఫొటోస్ షేర్ చేయడం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా శ్యామల షేర్ చేసిన పిక్స్ పై నెటిజన్స్ మండిపడుతున్నారు.
బ్లూ ట్రాన్స్పరెంట్ శారీ, డీప్ నెక్ బ్లౌజ్ లో శ్యామల దర్శనం ఇవ్వగా, ఇందులో ఆమె వేసుకున్న ఓవర్ మేకప్ బెడిసికొట్టినట్లు అనిపిస్తోంది. దీనితో నెటిజన్లు శ్యామలని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
కొందరు అయితే.. శ్యామల జబర్దస్త్ లో లేడీ గెటప్ వేస్తోందా అంటూ ఘోరంగా కామెంట్స్ పెడుతున్నారు. ఈ తరహా మేకప్ ఆమెకి సెట్ కాదని సూచిస్తున్నారు.