Telugu Flash News

Shyamala : నా చేతి వంట తిని నన్ను వెన్నుపోటు పొడిచింది.. శ్యామ‌ల షాకింగ్ కామెంట్స్

shyamala comments viral

Shyamala: టాలీవుడ్ యాంక‌ర్‌గా, న‌టిగా, బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకుంది శ్యామ‌ల‌. ఎంత మంది కొత్త యాంక‌ర్స్ వ‌చ్చిన కూడా శ్యామ‌ల రూటే స‌ప‌రేటు. కెరీర్ మొదట్లో బుల్లితెర సీరియల్స్ లో నటించిన ఈమె అనంతరం పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా న‌టించి మెప్పించింది.

ఈ అమ్మ‌డు ఓ యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తూ తనకు సంబంధించిన అన్ని విషయాలను ఎప్ప‌టిక‌ప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. 19 ఏళ్ల వయసులోనే నరసింహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్యామ‌ల ఇంట్లో వాళ్ల‌కి ఇష్టం లేకుండానే వివాహం చేసుకుంది. అయితే త‌మ‌ పెళ్లికి వాళ్ల‌ అమ్మ రాకపోవడం తనుకు చాలా బాధేసిందని ఆ లోటు అలాగే ఉండిపోయిందని ఒకానొక సంద‌ర్భంలో చెప్పుకొచ్చింది.

శ్యామ‌ల‌.. అనసూయ, రష్మీ, శ్రీముఖి తరహాలో శ్యామల అతిగా గ్లామర్ ఎక్స్ పోజింగ్ చేయ‌క‌పోయిన ఎంతో మంది అభిమానుల‌ని సంపాదించుకుంది. రీసెంట్ గా యాంకర్ శ్యామల బ్లాక్ బస్టర్ మూవీ విరూపాక్షలో కీలక పాత్రలో నటించిన మెప్పించింది. శ్యామల పాత్రకి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. రీసెంట్ గా శ్యామల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ లో, పర్సనల్ లైఫ్ లో ఎదురైన కష్టాల గురించి మాట్లాడింది.

త‌న‌ అమ్మని ఒప్పించి పెళ్లి మండపానికి తీసుకుని వెళ్లి ఉంటె బావుండేది అని బాధ‌ప‌డింది. ఇక మాకు ఒక బాబు పుట్టాక రెండు ఫ్యామిలీలు కలసిపోయి ఆనందంగా ఉన్నాం. నేను 8 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు కూడా యాంకరింగ్ చేశాన‌ని కూడా చెప్పుకొచ్చింది.. నాకు బాబు పుట్టాక కాస్త గ్యాప్ రావ‌డం, ఆ సమయంలో బిగ్ బాస్ నుంచి పిలుపు రావ‌డం నేను దానికి వెళ్ల‌డం జ‌రిగింది.

అయితే 11 నెలల బిడ్డని వదిలేసి బిగ్ బాస్ కి వెళ్ళింది అంటూ న‌న్ను దారుణంగా ట్రోల్ చేశారు. డబ్బుకోసం బిడ్డని కూడా వదిలేసింది అని ఎన్నో మాట‌లు అన్నారు. కానీ నా ఫ్యామిలీ నాకు ఎప్పుడు సపోర్ట్ ఇవ్వడంతో మిగిలిన కామెంట్స్ పెద్ద‌గా పట్టించుకోవలసిన అవసరం రాలేదు. కానీ కోవిడ్ సమయంలో ఒకావిడ నా భర్తపై చీటింగ్ కేసు పెట్టి ఎంతో బాధ పెట్టింది.. ఆమె మా ఇంటికి వచ్చినప్పుడు నా చేత్తో వండి భోజనం కూడా పెట్టాను. అయినప్పటికీ ఆమె మా ఫ్యామిలీ వెన్నుపోటు పొడిచి నానా నిందలు వేసింది. నా భర్త ఒకరిని మోసం చేసే వ్యక్తి కాదు అని నాకు చాలా బాగా తెలుసు. చివరకి అదే రుజువైంది అని యాంకర్ శ్యామల ఎమోషనల్గా కామెంట్స్ చేసింది. అయితే ఇప్పుడు శ్యామ‌ల కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.

also read :

Niharika : ఎవ‌డో కోన్ కిస్కా గొట్టం గాడి గురించి నాకెందుకు.. నిహారిక ఫైర్

Keerthy Suresh: మ‌ళ్లీ వార్త‌ల‌లోకి కీర్తి సురేష్ పెళ్లి.. ఆమె భ‌ర్త ఇత‌డేనా?

Exit mobile version