సినిమా సెలబ్రిటీలకి, క్రికెటర్స్‌కి మధ్య అనుబంధం చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. చాల మంది క్రికెటర్స్ సినిమా సెలబ్రిటీలని వివాహం చేసుకొని సంతోషకరమైన జీవితం గడుపుతున్నారు. వారిలో విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ, యువరాజ్-హెజెల్ కీచ్, హర్భజన్ సింగ్-గీతా బస్రా, హార్దిక్ పాండ్య-నటాషా స్టాంకోవిచ్.. ఇలా చాలా జంటలే ఉన్నాయి. ఇక ఇప్పుడు మరో యువ క్రికెటర్ కూడా ఈ జాబితాలో చేరబోతున్నాడని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆ క్రికెటర్ నోరు విప్పడంతో అందరికి క్లారిటీ వచ్చింది.
కన్ఫ్యూజన్లో పెట్టాడు..
టీమిండియా క్రికెటర్ శుభ్ మన్ గిల్ పేరు క్రికెట్ ప్రేమికులకి చాలా సుపరిచితం. అవకాశం వచ్చినప్పుడల్లా తన క్లాస్ బ్యాటింగ్‌తో అందరి ప్రశంసలు పొందుతుంటాడు. ఇక మనోడి ప్రేమ వ్యవహారాలు కూడా ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూనే ఉంటాయి. కొన్నాళ్లుగా సచిన్ కుమార్తె సారా టెండుల్కర్ తో గిల్ ప్రేమలో ఉన్నాడని అనేక రూమర్స్ వచ్చాయి. ఇన్ స్టాలో ఒకరి పోస్టులకు మరొకరు లైకులు కొట్టడం, కామెంట్ చేయడంతో అందరూ ఈ విషయం నిజమేనని అనుకున్నారు.. వీటి గురించి ఇద్దరు స్పందించకపోవడం, అలానే ఇరువురు సైలెంట్ అయిపోవడంతో అందరూ సారా-గిల్ గురించి మర్చిపోయారు.
ఇక ఈ ఏడాది ఆగస్టులో హీరోయిన్ సారా అలీఖాన్ తో గిల్ డిన్నర్ కి వెళ్లాడు. దీన్ని వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. అందరూ వీళ్లిద్దరూ డేటింగ్ లో ఉన్నారా? అని ముచ్చటించుకున్నారు. తాజాగా సారా అలీఖాన్ తో డేటింగ్ పై గిల్ అసలు విషయం బయటపెట్టేశాడు గిల్ . ‘దిల్ దియాన్ గలాన్’ టాక్ షోలో తాజాగా పాల్గొన్న శుభ్‌మన్ గిల్‌ని…. ‘నీ పరంగా చూస్తే బాలీవుడ్ లో ఫిట్టెస్ట్ ఫిమేల్ యాక్టర్ ఎవరు?’ అని హోస్ట్ సోనమ్ అడిగింది.. దీనికి మనోడు తడుముకోకుండా సారా అలీఖాన్ పేరు చెప్పాడు. ‘మీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారా?’ అడగ్గా.. ‘మే బీ(బహుశా ఉండొచ్చు)’ అని చెప్పి అందరిని కన్ఫ్యూజన్లో పడేశారు. ఈ వ్యాఖ్యల తర్వాత వీరిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉండి ఉండొచ్చనే టాక్ అయితే నడుస్తుంది.
also read news:
Superstar Krishna : కృష్ణ వీలునామా.. ఆస్తి మొత్తం ఎవరి పేరున రాశాడో తెలుసా ?
చరిత్ర లోనే అతిపెద్ద విలన్ చెంఘీజ్ ఖాన్..అతని స్టోరీ ఏంటి ?