shruti haasan: ఇటీవల సోషల్ మీడియాలో సెలబ్రిటీలు విచిత్ర పరిస్థితులు ఎదుర్కొంటుండడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా కమల్ గారాల పట్టి శృతి హాసన్ బాయ్ ఫ్రెండ్ తో కలిసి లైవ్ చాటింగ్ లో పాల్గొంది . ఈ ఆన్ లైన్ చాటింగ్ లో.. తన ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలకు ఓపికగా చెబూత వచ్చింది.
కొందరు వింత ప్రశ్నలు వేయగా, వారికి షాక్ అయ్యే విధంగా ఆన్సర్స్ ఇచ్చింది. అయితే శృతిని ఓ నెటిజన్.. మీతో సహజీవనం చేయాలనుకుంటున్నాను అని అనగా అందుకు.. నో అని చెప్పేసింది.
మరో నెటిజన్.. మీరు వర్జినేనా.. అని అడిగేశాడు. ఇక దాంతో శృతి హాసన్ కోపం కట్టలు తెంచుకుంది. వర్జిన్ స్పెల్లింగ్ తప్పు రాసి ప్రశ్న అడిగన నెటిజన్‌కి సమాధానం ఇస్తూ.. ముందు నువ్వు వర్జిన్ స్పెల్లింగ్ సరిగా రాయడం నేర్చుకో.. అంటూ ఘాటుగా సమాధానం చెప్పింది శృతి హాసన్.
గతంలోను ఈ అమ్మడికి ఇలాంటి విచిత్ర పరిస్థితులు ఎదురయ్యాయి. కాగా, ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది అందాల భామ శృతీ హాసన్. ఇటీవల ఈ అమ్మడు సీనియర్ హీరోలకు ఓన్లీ ఆప్షన్ గా మారిపోయింది . చిరంజీవి, బాలకృష్ణ సరసన వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాల్లో నటించి మంచి విజయాలనే అందుకుంది.
also read :