Shruti Haasan : సినిమా ఎలా ఉండబోతుందో ట్రైలర్, టీజర్ చెబుతున్నాయి. ప్రజలు తమకు ఇష్టమైన జానర్‌ని ఎంచుకుని సినిమాలు చూస్తారు. చాలా మందికి మాస్ సినిమాలంటే ఇష్టం. కాబట్టి అలాంటి సినిమాలు ఆడుతున్నాయి. అంతేకానీ సినిమాల వల్ల మనుషుల ఆలోచనలు మారవు. మాస్ సినిమాలు చూడటం హింసను ప్రేరేపించదు. మాస్ సినిమాలు హింసను ప్రేరేపించవని శృతి హాసన్ చెప్పింది. ఆమె నటించిన ‘సాలార్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.
ఈ నేపథ్యంలో సినిమాపై వస్తున్న నెగిటివ్ కామెంట్స్‌పై ఆమె స్పందించింది. ప్రజలకు ఏమి చూడాలో మరియు ఏమి వినాలో తెలుసు. వారికి నచ్చిన వాటిని చూస్తారు. సాలార్ అంటే అందరికీ ఇష్టమే. అందుకే చూస్తున్నారు. చూసిన వాళ్లంతా ప్రభాస్ లాగా బయటకు వచ్చి ఫైట్ చేయడం లేదు. ఆ మాటకొస్తే మన పురాణాల్లో హింస ఉంది. వాళ్లంతా హింసను ప్రేరేపిస్తున్నారని చెప్పగలమా?’ అని శృతి హాసన్ ప్రశ్నించారు. ఈ ఏడాది ఆమె నటించిన వాల్తేరువీరయ్య, వీరసింహారెడ్డి, సాలార్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ఈ ఏడాది మూడు హిట్లు అందుకున్న ఏకైక హీరోయిన్ శృతిహాసన్.
also read :
Salaar telugu movie review : ‘సలార్ తెలుగు మూవీ రివ్యూ