HomecinemaShriya Saran : బ‌హిరంగంగా ముద్దులు.. ట్రోల‌ర్స్ తిట్ల‌పై స్పందించిన శ్రియా

Shriya Saran : బ‌హిరంగంగా ముద్దులు.. ట్రోల‌ర్స్ తిట్ల‌పై స్పందించిన శ్రియా

Telugu Flash News

Shriya Saran : టాలీవుడ్ సీనియ‌ర్ హీరోయిన్ శ్రియా గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఒకానొక‌ప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలంద‌రితో క‌లిసి ప‌ని చేసిన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది.

ఇప్పుడు చిన్న చిన్న పాత్ర‌లు చేస్తూ త‌న అభిమానుల‌ని అల‌రిస్తూనే మరోవైపు త‌న భ‌ర్త‌తో, పిల్ల‌ల‌తో సంతోషంగా జీవితం గ‌డుపుతుంది. రష్యన్‌ అయిన ఆండ్రీ కొశ్చీవ్‌ను పెళ్లి చేసుకొని, ఓ పాపకు జన్మనిచ్చిన తర్వాత శ్రియ‌ అందం ఏమాత్రం తగ్గలేదు.

అయితే శ్రియ, ఆండ్రీ ఎక్కడికెళ్లినా పబ్లిగ్గానే లిప్‌ టు లిప్‌ కిస్‌ ఇచ్చుకోవడం కామ‌న్‌గా మారిపోయింది.ఆ మధ్య ఓ టీవీ షోలో అంద‌రిముందే లిప్ టూ లిప్ కిస్ ఇచ్చుకున్నారు. ఇక దృశ్యం 2 మూవీ స్పెషల్‌ స్క్రీనింగ్‌ సందర్భంగా కూడా ఈ జోడీ రెడ్‌ కార్పెట్‌పై అలాగే కిస్‌ ఇచ్చుకున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

వీరిద్ద‌రికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ‌ వైరల్‌ అయ్యాయి. వీళ్లెప్పుడూ ఇంతే పబ్లిగ్గా ఎందుకు ముద్దు పెట్టుకుంటారు. ఇలాంటివి ఇంట్లో చేసుకోవ‌చ్చు క‌దా అంటూ పలువురు నెటిజన్లు శ్రియ, ఆండ్రీలను ట్రోల్‌ చేశారు.

దీనిపై శ్రియ స్పందిస్తూ అందులో తప్పేముంది అన్నట్లు మాట్లాడింది. “ఇది ఫన్నీగా ఉందే, నా స్పెషల్‌ మూమెంట్‌లో నన్ను కిస్‌ చేయడాన్ని ఆండ్రీ మాముల‌గానే చూస్తాడు.

-Advertisement-

అత్యంత సహజమైన ఇలాంటి పనికి ట్రోల్‌ ఎందుకు చేస్తారో నాకు అర్ధం కాదు అని ఆండ్రీ అంటాడు. అయినా అవి మేము పెద్దగా పట్టించుకోము” అని శ్రియ అనడం విశేషం.

శ్రియ సినిమాల విషయానికి వస్తే.. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు మ్యూజిక్‌ స్కూల్ అనే బహుభాషా చిత్రంలో నటిస్తోంది. కన్నడలో తెరకెక్కుతున్న ఉపేంద్ర కబ్జా సినిమాలోను శ్రియ కీలకపాత్ర పోషిస్తోంది.

ప్ర‌స్తుతం పెద్ద‌గా హీరోయిన్ వంటి పాత్ర‌లు అందుకోలేక‌పోతున్న శ్రియ కొన్ని కీల‌క పాత్ర‌ల‌లో క‌నిపించి మెప్పిస్తుంది. ఈ అమ్మ‌డు రాజ‌మౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ అనే చిత్రంలోను క‌నిపించి సంద‌డి చేసిన విష‌యం తెలిసిందే.

also read news:

బిస్లరీ యజమాని తన కంపెనీని ముఖేష్ అంబానీకి బదులుగా టాటాకు ఎందుకు విక్రయిస్తున్నాడు?

ఆకాశంలో అద్భుతం.. ఈ ‘అరోరా బొరియాలిస్’ వెరీవెరీ స్పెషల్.. ఎందుకంటే..!?

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News