HomecinemaNTR31: ఎన్టీఆర్ సినిమాకి నో చెప్పిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. నాలుగేళ్ల త‌ర్వాత ప్ర‌భాస్ బ్యూటీ రీ ఎంట్రీ

NTR31: ఎన్టీఆర్ సినిమాకి నో చెప్పిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. నాలుగేళ్ల త‌ర్వాత ప్ర‌భాస్ బ్యూటీ రీ ఎంట్రీ

Telugu Flash News

NTR31: టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోంది. ఇప్ప‌టికే రెండు షెడ్యూల్స్ చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న వీలైనంత త్వ‌ర‌గా షూటింగ్ పూర్తి చేసుకొని వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేయ‌నున్నాడు. ఇప్పటికే ప్ర‌శాంత్ నీల్ స్క్రిప్ట్ వ‌ర్క్ స్టార్ట్ కాగా, ఈ సినిమాకు సంబంధించి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన ఇప్పుడు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ కాంబోలో రూపొంద‌నున్న ఈ పాన్ ఇండియా మూవీలో ముందుగా దీపికా ప‌దుకొనె పేరుని ప‌రిశీలించారు. అయితే ఈ అమ్మ‌డు బిజీ షెడ్యూల్ కార‌ణంగా సినిమా చేయ‌లేన‌ని చెప్పేసింద‌ని, దాంతో మేక‌ర్స్ శ్ర‌ద్ధా కపూర్‌తో డిస్క‌ష‌న్స్ జ‌రుపుతున్న‌ట్టు తెలుస్తుంది. అయితే సాహో త‌ర్వాత మ‌రో పాన్ ఇండియా మూవీలో న‌టించ‌లేదు శ్ర‌ద్ధా క‌పూర్. ఈ అమ్మ‌డు NTR 31కి గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తే నాలుగేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ టాలీవుడ్ స్టార్ పాన్ ఇండియా మూవీలోకి రీ ఎంట్రీ ఇచ్చిన‌ట్లే అని అంద‌రు ముచ్చ‌టించుకుంటున్నారు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News