శరీరానికి తగిన వ్యాయామం అవసరమని వైద్యులు సూచిస్తుంటారు. రోజూ ఏదో ఒక రకంగా ఎక్సర్‌సైజ్ చేయాలి. కొందరు జిమ్ (Gym) లకు వెళ్లి కసరత్తులు చేస్తుంటారు. మరికొందరు వాకింగ్ చేయడానికి ట్రెడ్‌మిల్ లాంటివి తెచ్చుకుంటూ ఉంటారు.
అయితే, వ్యాయామం చేసేటప్పుడు ఆహారం తీసుకోవాలా? వద్దా? అని చాలా మందికి అనుమానం కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా జిమ్‌కు వెళ్లేటప్పుడు ఫుడ్ తినాలా వద్దా అనే దానిపై భిన్న వాదనలు ఉన్నాయి.
కొందరు వ్యాయామం ముందు ఆహారం తినాలని చెబుతున్నారు. మరికొందరు ఎక్సర్‌సైజ్‌కు వెళ్లేముందు కడుపు నిండుగా ఉండరాదని హెచ్చరిస్తున్నారు.
1. వ్యాయామం చేయడానికి అరగంట ముందు మాత్రమే చిరుతిళ్లు తినాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
2. బాదం పప్పు తినడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అయితే, జిమ్‌కి వెళ్లేటప్పుడు తింటే కడుపునొప్పి వస్తుందంటున్నారు.
3. జిమ్‌కి వెళ్లే ముందు కెఫీన్ ఉండే కాఫీ తాగడం వల్ల బాడీ డీహైడ్రేట్ అవుతుంది.
4. అవిసె గింజలు అరిగిపోవడానికి సమయం పడుతుంది. వాటిని అవాయిడ్ చేయాలి.
5. జిమ్‌కి వెళ్లే ముందు నాన్‌వెజ్, నూనెలో వేయించిన ఫుడ్ అసలే తీసుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
also read:
horoscope today telugu : 04-02-2023 ఈ రోజు రాశి ఫలాలు
Kakani Govardhan Reddy : కోటంరెడ్డిపై మంత్రి కాకాణి ఫైర్..కేంద్రానికి ఎందుకు ఫిర్యాదు చేయలేదు మరి?