Short Stories in Telugu : తెనాలి రామలింగడు రాజమందిరానికి వెళుతున్నప్పుడు, మందిరంలోని ఒక వ్యక్తి ఒక పెద్ద పళ్లెంలో తియ్యటి వాసన వస్తున్న పెద్ద మామిడిపండ్లను మరియు ఒక ఉత్తరాన్ని తీసుకువెళుతున్నాడు. ఆ మామిడిపండ్లు చూడటానికి కూడా చాలా బాగున్నాయి, కాబట్టి రామలింగడికి వాటిని తినాలని కోరిక కలిగింది. అయితే, అతను తన కోరికను అణచుకొని రాజమందిరానికి చేరుకున్నాడు.
అతని వెనకాలే మామిడిపండ్ల పళ్లెంతో లోపలికి వచ్చిన వ్యక్తి, “రాజా, వీటిని మీ కోసం పక్కరాజ్యపు రాజు పంపించారు. ఈ పండ్లు తిన్న వాళ్లకి దీర్ఘాయుష్షు ప్రాప్తిస్తుందని సందేశం” అని అన్నాడు. పండ్లు అక్కడ ఉంచమని రాజు చెప్పాడు.
ఎదురుగా ఉన్న పండ్లను చూసి రామలింగడికి బాగా నోరూరింది. వెంటనే అందులోని ఒక పండును తీసుకుని కొరికాడు. “ఏమిటీ… మహారాజు కోసం పంపిన పండును నువ్వు తింటావా… అదీ కనీసం నా అనుమతి తీసుకోకుండానే… ఎంత ధైర్యం… నీకు మరణ శిక్ష తప్పదు” అంటూ గట్టిగా అరిచిన రాజు, భటులను పిలిపించి రామలింగడిని తీసుకుపొమ్మన్నాడు.
వాళ్లు రామలింగడిని పట్టుకోగానే, “అమ్మో పక్కరాజ్యపు రాజు ఎంత దుర్మార్గుడు. మంచి పండ్లని చెప్పి, ఎలాంటి మామిడి పండ్లను మనకు పంపాడు. ఈ పండు ముక్కను కొరికినందుకే వెనువెంటనే నాకు చావు మూడింది. అదే పండు మొత్తం తిన్నవాడు ఏమైపోతాడో…” అంటూ అరవడం మొదలుపెట్టాడు.
రామలింగడి చమత్కారపు మాటలకు రాజుకు విపరీతంగా నవ్వు వచ్చింది. అతన్ని వదలమని చెప్పడమే కాకుండా కొన్ని పండ్లను కూడా రామలింగడికిచ్చి పంపాడు.
also read :
RGV : ఆర్జీవీ ‘వ్యూహం’తో ఏపీ రాజకీయాలలో కలకలం! లోకేష్ నోటీస్…
Ram Charan : రామ్ చరణ్ తదుపరి సినిమా ఎప్పుడు ?
Horoscope Today in Telugu: నవంబర్ 20, 2023 ఈ రోజు రాశి ఫలాలు