short stories in telugu : పూర్వం వెంకట శర్మ అనే గురువు ఉండేవాడు. శిష్యులతో కలిసి గ్రామ పర్యటనలకు వెళ్లి ప్రవచనాలు చెప్పేవారు. ఒకసారి ఆయన తన అనుచరులతో ప్రయాణిస్తుండగా కొందరు గ్రామస్థులకు ఈ విషయం తెలిసింది. గురువు గారు.. మీరు మా గ్రామం లో ఉండండి. మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం’ అన్నారు.
అప్పుడు గురువు వారి ఆహ్వానాన్ని, ఆతిథ్యాన్ని సున్నితంగా తిరస్కరించారు. వారికి ఆశీస్సులు అందజేసి ముందుకు సాగారు.
తర్వాత వారు మరో గ్రామానికి చేరుకున్నారు. ‘శిష్యులారా, ఇక్కడ విశ్రాంతి తీసుకొందాము’ అన్నాడు వెంకట శర్మ. కానీ అక్కడ గురువును ఎవరూ పలకరించలేదు. అందుకే అక్కడున్న వాళ్లతో ‘మీ ఊరిలో ఉండటానికి స్థలం చూపించండి’ అన్నాడు.
ఆ గ్రామస్తులు సరిగా సమాధానం చెప్పకపోగా హేళనగా మాట్లాడారు. ఆ తర్వాత శిష్యులు మరికొందరిని ఇలాగే ప్రశ్నించగా చాలా దురుసుగా సమాధానం చెప్పారు. గురువుగారు ఆ ఊరిలోనే ఆగుతామని అంటారు.
శిష్యులు గురువుగారితో.. ‘ఇంతకుముందు గ్రామస్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అనుకున్న మీరు అక్కడ ఉండలేదు. ఇక్కడ మనకు కనీసం మర్యాద కూడా ఇవ్వడం లేదు. మీరు ఏమి ఆలోచిస్తున్నారో మాకు అర్థం కావడం లేదు.’ అని అన్నారు.
‘ఇంతకు ముందు ఊరి జనంలో వినయ విధేయత, సంస్కారం, గౌరవం, మర్యాద పుష్కలంగా ఉన్నాయి .. అలాంటి చోట మనం కొత్త బోధనలు చేయాల్సిన అవసరం లేదు.. కానీ ఈ గ్రామస్థులకు కనీస మానవత్వం, మర్యాద లేని వారు.. వారికి నేను సలహా ఇవ్వాలి.
నాలుగు మంచి మాటలు చెప్పి వాళ్ళని మార్చాలి.అందుకే ఇక్కడే ఆగుదాం అన్నాను’ అని వివరించాడు వెంకట శర్మ. అప్పుడు శిష్యులందరూ అర్థమైనట్లు తల ఊపి బస ఏర్పాట్లు చేయడానికి ముందుకు సాగారు.
also read :
moral stories in telugu : నీతి కథలు చదవండి