Homecinemasobhita dhulipala : అందంగా లేనని వద్దన్నారు.. కానీ ఇప్పుడు..శోభిత కామెంట్స్

sobhita dhulipala : అందంగా లేనని వద్దన్నారు.. కానీ ఇప్పుడు..శోభిత కామెంట్స్

Telugu Flash News

sobhita dhulipala : ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్స్‌గా స‌త్తా చాటుతున్న హీరో,హీరోయిన్స్ ఒక‌ప్పుడు ఎన్నో క‌ష్టాల‌ని దాటుకుంటూ వ‌చ్చిన వాళ్లే . ఇండస్ట్రీలో రాణించాలి అంటే.. అందంతో పాటుగా అదృష్టం కూడా ఉండి తీరాల్సిందే. దాంతో పాటు కొంచెం హార్డ్ వ‌ర్క్ కూడా ఉండాలి.

అయితే కొంద‌రు ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో అవకాశాల కోసం తిరిగే టైమ్ లో ఎన్నో బాధలను, చీత్కారాలను ఎదుర్కొని చాలా ఇబ్బందులు పడ్డ‌వారే. మ‌న తెలుగు హీరోయిన్ కి అందంగా లేనని అవకాశాలు ఇవ్వనని చెప్పార‌ని తాజాగా ఆవేదన వ్యక్తం చేసింది.

గూఢాచారి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అందాల ముద్దుగుమ్మ శోభిత ధూలిపాళ్ల.. మేజర్ సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా స‌త్తా చాటిన ఈ భామ నాగ చైతన్య‌తో ప్రేమాయ‌ణం వ్య‌వ‌హారంలో హాట్ టాపిక్ అయింది.

తాజాగా ఈ అమ్మ‌డు ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..”నేను అందంగా లేను అని నాకు అప్పుడు అవకాశాలు ఇవ్వలేదు. 20 ఏళ్లు ఉన్నప్పుడు నేను ఓ షాంపు కంపెనీకి ప్రకటన కోసం వెళ్ల‌గా, వారు బ్యాక్ గ్రౌండ్ మోడల్ గా కూడా పనికి రావు అని చెప్పారు. కొద్ది సంవత్సరాల తర్వాత అదే కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా అయ్యా అంటూ సంతోషంగా చెప్పుకొచ్చింది శోభిత‌.

also read :

Nabha Natesh Latest Photo gallery, Photoshoot, Images 2023

-Advertisement-

pooja for marriage : మీ పిల్లలకు పెళ్ళి కాలేదని బాధపడుతున్నారా ?

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News