Telugu Flash News

Shoaib Akhtar: ఇండియా మా ఆశ‌లపై నీళ్లు చ‌ల్లింది… షోయబ్‌ అక్త‌ర్ షాకింగ్ కామెంట్స్

shoaib akhtar comments on indian team

Shoaib Akhtar on PAK’s chances after IND’s loss to South Africa

Shoaib Akhtar: ప్ర‌స్తుతం టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ట‌ఫ్ ఫైట్ న‌డుస్తుంది సూప‌ర్ 12లో టాప్ 2లో ఎవ‌రు నిలుస్తారా అని ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. పాకిస్తాన్ టీం ఇండియా, జింబాబ్వేల‌పై ఓడిపోవ‌డంతో సెమీస్ అవ‌కాశాల‌ని క‌ష్టం చేసుకుంది.

ఒక‌వేళ ఇండియా… ద‌క్షిణాఫ్రికాపై గెలిచి ఉంటే మాత్రం పాక్‌కి కొంత ఛాన్స్ ఉండేది. కాని ఆదివారం మ్యాచ్ లో ఇండియా ఓడిపోవ‌డంతో పాక్ జ‌ట్టుకి సెమీస్ అవకాశాలు పోయిన‌ట్టు అని చెప్పాలి. దీనిపై అక్త‌ర్ స్పందించారు.

దక్షిణాఫ్రికాపై భారత్‌ ప్రదర్శన తనను నిరాశపరిచిందని పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ అన్నాడు. భారతదేశం దక్షిణాఫ్రికాను ఓడించినట్లయితే, పాక్‌కి ఛాన్స్ ఉండేది. కాని వారు మా దారులన్నీ మూసేసిన‌ట్టే.

అక్త‌ర్ షాకింగ్ కామెంట్స్..

ఇండియా మా ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది. దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. ఇది భారత్ తప్పు కానప్పటికీ, పాకిస్థాన్ చాలా ఘోరంగా ఆడింది.

భారతదేశం బలంగా ఆడి, ట్రోఫీ ద‌క్కించుకోవాలి అని నేను కోరుకుంటున్నాను అని అక్తర్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నాడు.

“భారత్ దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలింగ్ ముందు తేలిపోయింది. కానీ వారికి ఇంకా ఛాన్స్ ఉంది. దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ మ‌ధ్య గ‌ట్టి పోటీ న‌డుస్తుంది.

పాక్ సెమీస్ కి రావ‌డం అసాధ్యంగా కనిపిస్తోంది కానీ నేను ఇప్పటికీ నా టీంకి మద్దతు ఇస్తున్నాను. ఏం జరుగుతుందో చూద్దాం’’ అన్నాడు అక్త‌ర్.

ఇటీవ‌ల అక్త‌ర్.. పాక్ జ‌ట్టుపై నిప్పులు చెరిగాడు. ‘పాకిస్తాన్ ఆటగాళ్లకు ఆటను అర్థం చేసుకోవడం ఎందుకు కష్టంగా ఉందో అర్ధం కావ‌డం లేదు.

టాప్‌, మిడిల్‌ ఆర్డర్‌తో పాకిస్తాన్ పెద్ద పెద్ద విజయాలు సాధించగలమని గతంలో కూడా చెప్పాను.. మళ్లీ చెబుతున్నా. పాకిస్తాన్ జట్టుకు బ్యాడ్‌ కెప్టెన్‌ ఉన్నాడు. తన ఆట తీరుతో టీ20 ప్రపంచకప్‌ 2022 నుంచి పాక్ నిష్క్రమించింది.

పాకిస్తాన్ కెప్టెన్సీ, మెనేజ్‌మెంట్‌ నిర్ణయాల్లో లోపాలు ఉన్నాయి’ అని షోయబ్‌ అక్తర్ కామెంట్స్ చేసిన విష‌యం తెలిసిందే.

read more news:

Horoscope : 31-10-2022 ఈ రోజు మీ రాశి ఫలాలు తెలుసుకోండి..

Myositis : స‌మంత‌కి సోకిన ‘మయోసైటిస్‌’ వ్యాధి ల‌క్ష‌ణాలేంటి ?

 

Exit mobile version