HomecinemaSharwanand: జ‌న‌వ‌రిలో ఎంగేజ్‌మెంట్ జ‌రుపుకున్న శ‌ర్వా ఇంకా పెళ్లి పీట‌లెక్క‌డంలేదు ఎందుకు..!

Sharwanand: జ‌న‌వ‌రిలో ఎంగేజ్‌మెంట్ జ‌రుపుకున్న శ‌ర్వా ఇంకా పెళ్లి పీట‌లెక్క‌డంలేదు ఎందుకు..!

Telugu Flash News

Sharwanand: టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్స‌మ్ హీరో శ‌ర్వానంద్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఆయ‌న ఈ ఏడాది జనవరి 26 వ తేదీన తెలంగాణ హై కోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె అయిత‌న రక్షిత రెడ్డి తో నిశ్చితార్థం జ‌రుపుకున్న విష‌యం తెలిసిందే. చాలా సింపుల్ గా బంధు మిత్రులు మరియు కొంతమంది సినీ ప్రముఖుల మధ్య శర్వానంద్ ఈ నిశ్చితార్థం జ‌రుపుకోగా, ఇంకా పెళ్లి గురించి ఎలాంటి అప్‌డేట్ లేదు.

అయితే శర్వానంద్ గత కొంతకాలం నుండి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడని, అదే కాకుండా వీళ్లిద్దరికీ పెళ్ళికి ప్రస్తుతం ఉన్న ముహుర్తాలు ఏవీ అంత అనుకూలంగా లేవ‌నే టాక్ న‌డుస్తుంది. ఈ కార‌ణంగానే శ‌ర్వానంద్ పెళ్లి కొద్ది రోజుల వ‌ర‌కు వాయిదా ప‌డింద‌నే టాక్ వినిపిస్తుంది. మ‌రి దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది. శర్వానంద్ రీసెంట్ గానే ‘ఒకేఒక జీవితం’ అనే సినిమాతో హిట్ కొట్టి ఫామ్‌లోకి వ‌చ్చాడు. ప్రస్తుతం ఆయన శ్రీరామ్ ఆదిత్య తో తన 35 వ సినిమా చేస్తుండ‌గా, ఇందులో ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి క‌థానాయిక‌గా నటిస్తుంది.

also read :

Ugram Telugu movie review :’ఉగ్రం’ తెలుగు మూవీ రివ్యూ … అల్ల‌రోడు హిట్ కొట్టిన‌ట్టేనా..!

Rama Banam movie review : ‘రామ‌బాణం’ మూవీ రివ్యూ .. గోపిచంద్ ఖాతాలో హిట్ ప‌డ్డ‌ట్టేనా..!

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News