HomecinemaSharwanand: మరో వారం రోజుల్లో పెళ్లి.. కారు ప్రమాదంలో గాయపడ్డ హీరో శర్వానంద్

Sharwanand: మరో వారం రోజుల్లో పెళ్లి.. కారు ప్రమాదంలో గాయపడ్డ హీరో శర్వానంద్

Telugu Flash News

Sharwanand: టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కెరీర్లో భిన్నమైన సినిమాలు చేస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న శర్వానంద్ కొన్ని నెలల క్రితం రక్షిత అనే అమ్మాయితో నిశితార్థం జరుపుకున్నాడు.

వీరి పెళ్లి ఎప్పుడు జ‌రుగుతుందా అని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న క్రమంలో శర్వానంద్ జూన్ 3న జైపూర్ ప్యాలెస్ లో వివాహం చేసుకోబోతున్న‌ట్టు తెలియ‌జేశాడు. మ‌రి కొద్ది రోజుల‌లో పెళ్లి ఉంద‌న‌గా, ఇంత‌లోనే శర్వానంద్ కు యాక్సిడెంట్ జరిగింది. శర్వానంద్ కు ఇవాళ తెల్లవారు జామున యాక్సిడెంట్ జ‌రిగినట్టు తెలుస్తుంది.

ఆదివారం ఉద‌యం మూడు గంట‌ల ప్రాంతంలో శ‌ర్వానంద్ త‌న డ్రైవ‌ర్‌తో క‌లిసి ఫిల్మ్ న‌గ‌ర్‌లో ప్రయాణిస్తూ ఉండ‌గా, వారు ప్ర‌యాణిస్తోన్న రేంజ్ రోవ‌ర్ కారు ఫిల్మ్ న‌గ‌ర్ జంక్ష‌న్ దగ్గ‌ర డివైడ‌ర్ ని డీకొన‌డంతో అదుపు త‌ప్పి బోల్తా ప‌డింది. డ్రైవ‌ర్ ప‌క్క‌నే కూర్చున్న శ‌ర్వానంద్ స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ‌ట్టు తెలుస్తుంది. .అయితే ఈ ప్ర‌మాదంపై ఇటు శ‌ర్వానంద్ కానీ.. ఆయ‌న టీమ్ కానీ ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌లేదు.

అయితే ప్రమాదం జరిగిన సమయంలో అసలు ఆ కారులో శర్వానంద్ లేరని మ‌రి కొంద‌రు చెప్పుకొస్తున్నారు. దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది. వారంలోపే వీరి పెళ్లి ఉంద‌న‌గా ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌టం అభిమానుల‌ని క‌లిచివేస్తుంది. ఆయ‌న స‌న్నిహితులు శ‌ర్వానంద్‌కి కాల్ చేసి యోగ క్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు. రేంజ్ రోవర్ కారు లో సేఫ్టీ ఫీచర్స్ ఎక్కువ‌గా ఉండ‌డం వల్ల.. శ‌ర్వానంద్‌కి పెద్దగా గాయాలు కాలేదని తెలుస్తోంది. మొత్తంగా ఈ ఘటన మాత్రం స్థానికంగా కలకలం రేపడంతో పాటు ప్ర‌తి ఒక్క‌రిని టెన్ష‌న్‌కి గురి చేసింది.

ఈ ఏడాది జ‌న‌వ‌రి 26న శ‌ర్వానంద్, ర‌క్షితల ఎంగేజ్ మెంట్ వేడుక హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఎంగేజ్‌మెంట్ వేడుక‌కి ఇండ‌స్ట్రీ నుండి చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, సిద్ధార్థ్, అదితిరావు హైదరి, నాని.. ఇలా ఎంతో మంది సినీ ప్రముఖులు హాజ‌రయ్యారు. స‌న్నిహితులు, ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో శర్వా, రక్షిత ఉంగరాలు మార్చుకొని నిశ్చితార్థం జ‌రుపుకున్నారు..

ఇక రాజ‌స్థాన్ జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో జూన్ 2న మెహందీ ఫంక్షన్ తో ఈ పెళ్లి వేడుక జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఆ తరవాత రోజు ఉదయం శర్వానంద్‌ను పెళ్లికొడుకును చేస్తారు. ఇక‌ అదే రోజు శర్వానంద్, రక్షిత పెళ్లి జరుగుతుంది. రాత్రి 11 గంటలకు పెళ్లి వేడుక ఉంటుంద‌ని కుటుంబ స‌భ్యులు చెప్పుకొచ్చారు. ఈ పెళ్లి వేడుక‌క కోసం శ‌ర్వానంద్ భారీ ఎత్తునే ఖ‌ర్చు పెడుతున్న‌ట్టు వినికిడి.

-Advertisement-

read more news :

Sharwanand – Rakshitha reddy Engagement Photos

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News