Telugu Flash News

Kajol-Sharukh Khan : కాజోల్ కామెంట్స్ పై షారూఖ్ ఖాన్ ఫ్యాన్స్ ఫైర్ !

sharukh khan kajol

Kajol-Sharukh Khan : బాలీవుడ్‌ లో కాజోల్, షారుఖ్ ఖాన్‌లు హిట్ పెయిర్ అనే విషయం అందరికీ తెలిసిందే . దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే, బాజీగర్ మరియు దిల్‌వాలే కాకుండా మరో నాలుగు చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. అవన్నీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టి సూపర్ హిట్ చిత్రాలయ్యాయి. ఇక చాలా సినిమాల్లో కలిసి నటించడం వల్ల ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది.

షారుఖ్-కాజోల్ ఇప్పటికీ మంచి స్నేహితులు గా ఉన్నారు. ఆ కారణంగానే కాజోల్ చేసిన సరదా కామెంట్స్ ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. ఆమెపై షారుక్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఇటీవల విడుదలైన కాజోల్ చిత్రం ‘ది ట్రయల్’ నేపథ్యంలో, ఆమె చిత్ర బృందంతో కలిసి మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్నది.

ఇందులో భాగంగా షారుక్ ఖాన్ గురించి ప్రశ్నించగా..’షారుక్, నేను మంచి స్నేహితులం. ఆయనతో నటించే అవకాశం వస్తే ఇప్పటికీ వదులుకోను. ఆయనతో మళ్లీ రొమాంటిక్ సాంగ్ చేయాలనుకుంటున్నాను’ అని కాజోల్ తెలిపింది.

మీకు షారుఖ్ కలిసినప్పుడు అడగాలని అనుకునే ఒకే ఒక ప్రశ్న ఏంటి అని మీడియా అడగగా .. ‘పఠాన్‌’ మూవీ ఒరిజినల్ కలెక్షన్స్‌ ఎంతో చెప్పమంటాను’అని నవ్వుతూ జవాబిచ్చారు. అయితే కాజోల్ సరదాగా అన్న ఈ కామెంట్స్ ఫాన్స్ కి నచ్చలేదు. మా హీరో మూవీ కి వచ్చిన 1000 కోట్ల కలెక్షన్స్‌ నిజం కదా? మా హీరో అబద్దం ఎందుకు చెప్తాడు ? అని షారుక్‌ అభిమానులు కాజోల్‌ని ట్రోల్‌ చేస్తున్నారు.

also read :

Krithi Shetty : సోషల్ మీడియాలో పెరుగుతున్న బేబమ్మ క్రేజ్

devara update : బిగ్ అప్‌డేట్‌ ఇచ్చిన దేవర టీం.. ఏంటంటే ?

Exit mobile version