Homecinema27 Years Of 'Dilwale Dulhania Le Jayenge' : మళ్ళీ ఆ మ్యాజిక్ చేయడం కష్టం అంటున్న షారుఖ్!

27 Years Of ‘Dilwale Dulhania Le Jayenge’ : మళ్ళీ ఆ మ్యాజిక్ చేయడం కష్టం అంటున్న షారుఖ్!

Telugu Flash News

‘దిల్ వాలే దుల్హానియా లే జాయేంగే’ (Dilwale Dulhania Le Jayenge) సినిమా ఎంత పెద్ద సంచలనమో అందరికి తెలిసిందే. ఇప్పటికి అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రాల్లో ఈ సినిమా ఒకటి. షారుఖ్ ఖాన్ , కాజోల్ జంటగా నటించిన ఈ సినిమా ఎక్కువకాలం థియేటర్లలో ప్రదర్శింపబడిన చిత్రంగా కూడా ఎన్నో రికార్డులు సాధించింది. అక్టోబర్ 20 1995 లో విడుదలైన ఈ సినిమా ఈ రోజు కి 27 ఏళ్లు పూర్తి చేసుకుంది.  షారుక్, కాజోల్ జంట కెమిస్ట్రీకి ప్రేక్షకులు అబ్బురపడ్డారు.

1995 లో ఆదిత్య చోప్రా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో లండన్ లో నివసిస్తున్న భారతీయ కుటుంబానికి చెందిన రాజ్ గా షారుఖ్ నటిస్తే, పెద్ద కుటుంబం నుండి అణకువగా పెరిగి తల్లిదండ్రుల మాటను జవదాటని అమ్మాయి సిమ్రన్ గా కాజోల్ నటించింది.

ఈ సినిమాలో ప్రతి పాట సూపర్ హిట్ ఇప్పటికి ఈ సినిమా సంగీతం అలరిస్తూనే ఉంటుంది. అప్పటివరకు యాంగ్రీ యంగ్ మాన్ అమితాబ్ బచ్చన్ యాక్షన్ సినిమాలతో నిండిన బాక్స్ ఆఫీస్ ముఖచిత్రం, ఈ అందమైన ప్రేమ కథతో మారిపోయింది. అప్పటినుండి సరికొత్త NRI కథలకు ఈ సినిమా ఊపిరి పోసింది.

‘దిల్ వాలే దుల్హానియా లే జాయేంగే’ సినిమా వచ్చి 27 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ షారుఖ్ ఇలా అన్నారు ” అప్పుడు అందరూ ఆదిత్యతో సహా సినిమా యూనిట్ అందరం వయసులో ఉన్నాము, కరణ్(కరణ్ జోహార్) కూడా ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు.

అందుకే ఆ సినిమా ఒక ట్రెండ్ సెటింగ్ సినిమా అయింది, అప్పటివరకు వస్తున్న సినిమాలకు అదొక ఫ్రెష్ లుక్ ఇచ్చింది అందుకే ఆ సినిమాకు ఆ మ్యాజిక్ కుదిరింది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అటువంటి మ్యాజిక్ కష్టమే కానీ ఒకవేళ సిక్వెల్ తీస్తానంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, నేను మరోసారి సిమ్రన్ ను తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను” అన్నారు.

ఈ సినిమా తర్వాత షారుక్, కాజోల్ జంట ‘కుచ్ కుచ్ హోతా హై’ , ‘కభీ ఖుషీ కభీ గమ్’ ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ ‘దిల్ వాలే’ వంటి సినిమాలలో జంటగా నటించారు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News