shardul thakur:ఇటీవలి కాలంలో టీమిండియా సెలక్షన్ వివాదాస్పదంగా మారుతుంది. మంచిగా ఆడుతున్న ఆటగాళ్లను పక్కన పెట్టి ఫామ్‌లో లేని వారిని ఆడించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో కుల్దీప్‌ని పక్కన పెట్టడంపై వివాదం మరింత రాజుకుంది. టీమిండియా తుది ఎంపికలో బీసీసీఐ సెక్రటరీ జై షా జోక్యం చేసుకుంటున్నాడే ప్రచారం నడిచింది. కేవలం ఆకతాయి అభిమానులే కాదు.. క్రికెట్ విశ్లేషకులుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన దిగ్గజాలు సైతం ఈ ఆరోపణలు చేసారు. బంగ్లాదేశ్‌తో ఆదివారం ముగిసిన రెండో టెస్ట్‌లో కుల్దీప్ యాదవ్‌ను పక్కనపెట్టి జయదేవ్ ఉనాద్కత్‌ను తీసుకోవడంతో ఈ వ్యవహారం వేడెక్కింది.
పిచ్ అనుగుడణంగా ఎక్స్‌ట్రా పేసర్ కావాలనుకున్నప్పుడు రెగ్యూల్ పేస్ ఆల్‌రౌండర్ అయిన శార్దూల్ ఠాకూర్ ఆడించకుండా గుజరాత్ ప్లేయర్ అయిన జయదేవ్ ఉనాద్కత్‌ను ఆడించాల్సిన అవసరం ఏం ఉందని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. జై షా ఆదేశాలతోనే ఈ మార్పు చేశారని స్పష్టంగా అర్థమవుతుందని కామెంట్ చేస్తున్నారు. అయితే శార్దూల్ ఠాకూర్‌కు మద్దతుగా.. టీమిండియాలో రాజకీయాలున్నాయని కొందరు అభిమానులు ట్వీట్లు చేస్తూ.. ఆయన గుజరాత్ రాజకీయాలకు బలి అవుతున్నారని మండిపడ్డారు. శార్డూల్ రంజీ ట్రోఫీలు ఆడుకోవడం ఉత్తమమని సూచించారు. అయితే ఈ ట్వీట్లను శార్దూల్ ఠాకూర్ లైక్ చేయడం వివాదాస్పదమైంది.
కుల్దీప్ యాదవ్‌ను కాదని జయదేవ్ ఉనద్కత్‌ను ఎంచుకోవడంపై ఓ వైపు చర్చ జరుగుతుండగా, ఇలా శార్దూల్ విషయం సోషల్ మీడియాకి ఎక్కడంతో ‘టీమిండియాలో ఏమవుతోంది’ అనే చర్చ ఊపందుకుంది. సుదీర్ఘ ఫార్మాట్‌లోకి 2018లో అరంగేట్రం చేసిన శార్దూల్ కేవలం 8 టెస్టులు మాత్రమే ఆడి 27 వికెట్లు పడగొట్టాడు. అయితే ఆ తర్వాత జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ వంటి బౌలర్ల రాకతో తుది జట్టులోకి శార్దూల్ రావడం కష్టంగా మారింది.మరి ఈ వివాదం వలన ఆయనకు రానున్న రోజులలో అసలే అవకాశాలు తలుపు తట్టవేమో అని ఆయన అభిమానులు కొందరు ఆందోళన చెందుతున్నారు.