HomecinemaSharat Babu: ప్ర‌ముఖ న‌టుడు శ‌ర‌త్ బాబు క‌న్నుమూత‌

Sharat Babu: ప్ర‌ముఖ న‌టుడు శ‌ర‌త్ బాబు క‌న్నుమూత‌

Telugu Flash News

Sharat Babu: ఇటీవ‌ల ఇండ‌స్ట్రీలో వ‌రుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక‌రి మృతి మర‌చిపోక ముందే మ‌రొక‌రు క‌న్నుమూస్తున్నారు. రీసెంట్‌గా ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు రాజ్ మృతి ఇండ‌స్ట్రీకి తీర‌ని విషాదాన్ని మిగిల్చింది. ఆ విషాదం నుండి తేరుకోక‌ముందే శ‌ర‌త్ బాబు మృతి వార్త అంద‌రిని క‌లిచి వేస్తుంది. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న శరత్‌బాబు గ‌త నెల రోజులుగా చికిత్స పొందుతున్నారు. అయితే ఈ రోజు ఉద‌యం ఆయ‌న ఆరోగ్యం మ‌రింత క్షీణించ‌డంతో కన్నుమూసారు. శరీరం మొత్తం విషపూరితం కావడంతో కిడ్నీలు, ఊపిరితిత్తులు, కాలేయం సహా ఇతర అవయవాలు అన్ని దెబ్బ తిన్నాయ‌ని, ఈ కార‌ణంగానే ఆయ‌న మ‌ర‌ణించార‌ని ఆసుప‌త్రి వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

శరత్‌బాబు భౌతికకాయాన్ని చెన్నై తరలించేందుకు కుటుంబ సభ్యులు త‌గిన ఏర్పాట్లు చేస్తున్నారు. శ‌ర‌త్ బాబు తెలుగు ప్రేక్ష‌కుల‌కి సైతం చాలా సుప‌ర‌చితం. ఆయ‌న ఎన్నో తెలుగు సినిమాలు చేశారు. 1951 జులై 31న విజయశంకర దీక్షితులు, సుశీలాదేవి దంపతులకు జ‌న్మించిన శ‌ర‌త్ బాబు అసలు పేరు సత్యంబాబు దీక్షితులు. సత్యనారాయణ దీక్షితులు అని కూడా కొంద‌రు పిలుస్తుంటారు. ఇక ఈయన స్వస్థలం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస కాగా కాన్పూర్ నుంచి శరత్‌బాబు కుటుంబం ఆమదాలవలసకు వలసగా వ‌చ్చిన‌ట్టు చెబుతున్నారు. ఆమదాలవలసలోని రైల్వే క్యాంటీన్‌ను శరత్‌బాబు కుటుంబం నడిపేదని టాక్. ఆ సమయంలో శరత్‌బాబు ప‌లు నాటకాలు వేయ‌డం అలానే కాలేజ్ డేస్‌లోను నాట‌కాల్లో ప‌లువురి దృష్టిని ఆక‌ర్షించ‌డంతో శ‌ర‌త్ బాబు మెల్ల‌మెల్ల‌గా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టారు.

Sharat Babu

శరత్‌బాబు మద్రాసు వెళ్లిన కొన్నాళ్లకే ఆయనకు సినిమాల్లో న‌టించే అవకాశం వచ్చింది. తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో సుమారు 250కి పైగా సినిమాలలో నటించిన శ‌ర‌త్ బాబు.. లెజెండరీ డైరెక్టర్ కే బాలచందర్ తెరకెక్కించిన గుప్పెడు మనసు చిత్రంతో లైమ్ లైట్‌లోకి వ‌చ్చారు. హీరోగానే కాకుండా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా పలు పాత్రలలో క‌నిపించి అల‌రించారు. చివరిగా పవన్‌ కల్యాణ్‌ వకీల్‌సాబ్‌ సినిమాలో జ‌డ్జి పాత్ర‌లో క‌నిపించి మెప్పించారు. శ‌ర‌త్ బాబు సినిమాల్లో నటిస్తూనే బుల్లితెరపైనా మంచి పాత్రలు పోషించి బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని కూడా అల‌రించారు.. ఈటీవీ అంతరంగాలు, జనని, అగ్నిగుండాలు సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకులకి ద‌గ్గ‌ర‌య్యారు శ‌ర‌త్ బాబు. ఆయ‌న మృతికి ప్ర‌తి ఒక్క‌రు సంతాపం తెలియ‌జేస్తున్నారు.

also read :

Rana: రానాకు క‌ల్లు దావ‌త్ ఇచ్చిన గంగ‌వ్వ‌.. నిషాలో ఏం చెప్పాడో తెలుసా ? వీడియో వైరల్ !

-Advertisement-

Keerthy Suresh Latest hot saree stills

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News