HomecinemaSharat Babu: శ‌ర‌త్ బాబు మ‌ర‌ణించారంటూ జోరుగా ప్ర‌చారాలు.. అస‌లు నిజం ఇదే..!

Sharat Babu: శ‌ర‌త్ బాబు మ‌ర‌ణించారంటూ జోరుగా ప్ర‌చారాలు.. అస‌లు నిజం ఇదే..!

Telugu Flash News

Sharat Babu:  సీనియ‌ర్ న‌టుడు శ‌ర‌త్ బాబు అనారోగ్యంతో కొద్ది రోజుల క్రితం ఆసుప‌త్రిలో చేరిన విష‌యం తెలిసిందే. కొన్ని రోజుల ముందు ఆయన ఆరోగ్యం బాగా క్షీణించ‌డంతో.. చెన్నై నుంచి బెంగళూరుకు…బెంగళూరు నుంచి హైదరాబాద్ కు త‌ర‌లించారు. అయితే ప్ర‌స్తుతం శ‌ర‌త్ బాబు ఆరోగ్య ప‌రిస్థితి సీరియ‌స్‌గా నే ఉంద‌ని డాక్ట‌ర్స్ తెలియ‌జేయ‌డంతో సోష‌ల్ మీడియాలో ఆయ‌న చ‌నిపోయారంటూ త‌ప్పుడు క‌థ‌నాలు హ‌ల్ చ‌ల్ చేశాయి.

కొన్ని మీడియా సంస్థలు కూడా శ‌ర‌త్ బాబు మ‌ర‌ణించార‌న్న వార్తలను ప్రముఖంగా ప్రసారం చేశాయి. ఖుష్బు లాంటి స్టార్స్ అయితే శరత్ బాబుకు రిప్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు కూడా చేసింది.ఇలాంటి ప‌రిస్థితుల‌ల‌లో శరత్ బాబు సోదరి స్పందించారు. అవన్నీ పుకార్లే అని.. వాటిని నమ్మొద్దంటూ.. మీడియాక తెలియజేశారు. అవ‌న్నీ అవాస్త‌వాలు. శరత్ బాబు కాస్త‌ రికవరీ అయ్యారు. ఐసీయు నుంచి రూమ్ కు షిఫ్ట్ చేశాం. తొందరలోనే శరత్ బాబు గారు పూర్తిగా కోలుకొని మీడియాతో మాట్లాడుతారు అని ఆశిస్తున్నాను అంటూ ప్రెస్ నోట్ విడుద‌ల చేశారు శ‌ర‌త్ బాబు సోద‌రి.

also read :

Horoscope (04-05-2023) : నేటి రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News