Shani Jayanti: ఈనెల 19న శని జయంతి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేయలేని వారు కొన్ని శ్లోకాలు చదువుకోవాలని, తద్వారా శని పీడ నుంచి రక్షణ పొందుతారని పండితులు చెబుతున్నారు. కొన్ని పరిహారాలు చేయడం వల్ల శని ప్రభావం తగ్గుతుందని చెబుతున్నారు.
వ్యక్తుల జీవితాల్లో గోచారస్థితి ఫలితంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని లాంటివి ఏర్పడుతుంటాయి. శని ప్రభావం పడితే యముడుని దాదాపు పరిచయం చేసి తీసుకొస్తాడని చెబుతారు. అంటే చావు అంచుల దాకా వెళ్లివస్తారట.
ఈ నేపథ్యంలో శని పట్టకుండా ఆపడం ఎవరి తరమూ కాదని పండితులు స్పష్టం చేస్తున్నారు. అయితే, ఆ ప్రభావం తగ్గించేందుకు, శని ప్రసన్నం చేసుకునేందుకు కొన్ని మంత్రాలు చదవుకోవాలని రుత్వికులు చెబుతున్నారు.
శని అమావాస్య రోజున శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆవాల నూనె, నువ్వుల నూనెతో దీపం వెలిగించాలట. ఏలినాటి శని,అష్టమ శని, అర్థాష్టమ శని దోషం నుంచి కాస్త ప్రభావం తగ్గించుకోవడానికి ఆలయాల్లో శనికి నువ్వుల నూనె, నువ్వులు, నల్లటి వస్త్రం సమర్పించాలని చెబుతున్నారు.
పితృ తర్పణం, నదులు-సరస్సుల్లో స్నానం చేసి దానధర్మాలు చేయడం ద్వారా మంచి ఫలితాలు చూడొచ్చు. చీమలకు ఆహారం వేయడం, పశువులు, పక్షుల దాహార్తిని తీరిస్తే మంచిది.
Read Also : RBI On Rs.2000 Notes: రెండువేల రూపాయల నోటుపై సంచలన నిర్ణయం.. ఉపసంహరించుకున్న ఆర్బీఐ