Homebigg boss telugu season 6bigg boss telugu season 6 : నాగార్జున చుర‌క‌లు.. తొలి ఎలిమినేట‌ర్ ఎవ‌రో తెలుసా?

bigg boss telugu season 6 : నాగార్జున చుర‌క‌లు.. తొలి ఎలిమినేట‌ర్ ఎవ‌రో తెలుసా?

Telugu Flash News

bigg boss telugu season 6 : ఎక్క‌డో విదేశాల‌లో మొద‌లైన బిగ్ బాస్ షో ఇప్పుడు మ‌న దేశంలో మంచి టీఆర్పీతో దూసుకుపోతుంది. తెలుగులో ఈ షో స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ అవుతుండ‌గా, తాజాగా సీజ‌న్ 6 జ‌రుపుకుంటుంది. నాగార్జున హోస్ట్‌గా 21 మంది స‌భ్యుల‌తో మొద‌లైన ఈ షోలో తొలి ఎలిమినేట‌ర్‌గా షానీ బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు. డబుల్ ఎలిమినేష‌న్ అని చెప్పి షానీ ని ఎలిమినేట్ చేసిన నాగార్జున ఆయ‌న‌కు దారుణ‌మైన వీడ్కోలు ఇచ్చారు.

ఎలిమినేట్ అయిన ఇంటి సభ్యుడిగా అత‌డికి సరిగ్గా సెండ్ ఆఫ్ ఇవ్వలేదు. స్టేజ్ పైకి వచ్చాక జర్నీ వీడియో చూపించక‌పోగా, చివ‌రికి ఇంటి సభ్యులతో మాట్లాడించలేదు. అయితే సమయం లేకపోవడం వల్ల ఇదంతా చేయలేదా? అసలు షానీ నిజంగానే ఎలిమినేట్ అయ్యాడా అనే సందేహాలు అంద‌రిలో వ్య‌క్తం అవుతున్నాయి.

దారుణ‌మైన వీడ్కోలు..

ఇక శ‌నివారం ఎపిసోడ్‌లో నాగార్జున ఒక్కొక్క‌రికి లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకాడు. బాలాదిత్య, షానీ, సుదీప, వాసంతి, శ్రీ సత్య, మెరినా రోహిత్, అభినయ, కీర్తి, శ్రీహాన్ ఇలా తొమ్మింది మందిని సోఫా వెనుక నిలుచోమ‌ని చెప్పిన నాగార్జున కూర్చున్న వారికి ముందుగా క్లాసులు పీకి మిగ‌తా వారికి తర్వాత చుర‌క‌లు అంటించాడు. నీ ఆట తీరు బాగా లేదు.. స్ట్రాటజీ పేరుతో మోసం చేసుకోకు.. అని ఫైమాకి గ‌ట్టిగానే క్లాస్ పీకాడు.

సూర్య.. బయట అన్ని పనులు చేస్తావ్ కదా?. ఇక్కడ చిల్ అవ్వడానికి వచ్చావా?.. వండి పెడితే మార్కులు పడతాయ్ అని అనుకున్నావా?.. అంటూ మండిప‌డ్డాడు. నీకు రేవంత్‌ని నువ్వేమైన తోపువా? బొట్టు పెట్టుకుంటే.. నచ్చుతారు.. ఇలా తయారవ్వాలి.. మనుషులు ఇలా ఉండాలి.. అని నీతులు చెప్ప‌డానికి వ‌చ్చావా అంటూ క్లాస్ పీకారు.

నేహా.. దెబ్బలు తగిలాయని ఆటను ఆపకూడదు అంటూ స‌ల‌హా ఇవ్వ‌గా, ఆరోహి కాస్త గ‌ట్టిగా ఆడు అన్నాడు నాగ్. ఇక గీతూ.. నీకు వందకు రెండు వంద మార్కులు.. అని నాగ్ మెచ్చుకున్నాడు. ఇనయ.. ఆటలోకి వచ్చావ్.. బాగా ఆడావ్.. మనుషుల సపోర్ట్ లేదని బాధపడకు.. అంటూ నాగార్జున హిత‌బోధ చేశాడు.

రాజ్.. నువ్ కెప్టెన్ అయిన తీరు కరెక్ట్ కాదు. జాలి కరుణతో అయ్యావ్.. గ‌ట్టిగా ఆడి గెలువు అంటూ సూచ‌న‌లిచ్చాడు. ఇక ఆదిరెడ్డికి కూడా కొంత గ‌ట్టిగానే ఇచ్చాడు. నిలుచున్న‌వాళ్ల‌ని మాత్రం ఓ రేంజ్‌లో మండిప‌డ్డాడు నాగ్.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News