HomecinemaShakuntalam: ఎట్ట‌కేల‌కు శాకుంత‌లం నుండి వ‌చ్చిన స‌ర్‌ప్రైజ్.. స‌మంత లుక్ చూసి స్ట‌న్ అవుతున్న ఫ్యాన్స్

Shakuntalam: ఎట్ట‌కేల‌కు శాకుంత‌లం నుండి వ‌చ్చిన స‌ర్‌ప్రైజ్.. స‌మంత లుక్ చూసి స్ట‌న్ అవుతున్న ఫ్యాన్స్

Telugu Flash News

Shakuntalam: స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో గుణ‌శేఖ‌ర్ తెర‌కెక్కించిన చిత్రం శాకుంతలం. కొద్ది రోజులుగా ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ లేదు. ఎట్ట‌కేల‌కు చాలా రోజుల త‌ర్వాత ఈ భారీ సినిమా అప్డేట్ అందించారు. నవంబర్ 4న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టు ఓ సాలిడ్ పోస్టర్ ని రిలీజ్ చేశారు మేక‌ర్స్ .

ఇందులో సమంత తో పాటు దేవ్ మోహన్ కనిపిస్తుండగా బ్యాక్ గ్రౌండ్‌లో గుణశేఖర్ మార్క్ భారీ సెట్ కూడా కనిపిస్తుంది. దిల్ రాజు మరియు గుణశేఖర్ లు భారీ వ్యయంతో నిర్మాణం వహించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. న‌వంబ‌ర్ 4న చిత్రం విడుద‌ల కానున్న నేప‌థ్యంలో మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్ స్పీడ్ పెంచ‌డం ఖాయం.

శాకుంత‌లం అప్‌డేట్..

గుణశేఖర్ ఎపిక్ లవ్ స్టోరీగా తెరకెక్కించిన భారీ బడ్జెట్ మూవీ ‘శాకుంతలం’ తెలుగు ఆడియెన్స్‌ను ఊరిస్తూ వస్తోంది. ఈ సినిమాను మైథలాజికల్ డ్రామాగా చిత్ర యూనిట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించ‌గా, ఈ సినిమా షూటింగ్ పూర్తయి రోజులు గడుస్తున్నా, ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్‌డేట్స్ ఇవ్వ‌లేదు. తాజా అప్‌డేట్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

భారీ సినిమాలకు పెట్టింది పేరు అయిన గుణశేఖర్ ఇటీవల కాలంలో మంచి విజయాలను అందుకోలేకపోయాడు. దాంతో ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా చేయాలని భావించి ఈ మైథాలజికల్ సబ్జెక్టును ఎంచుకోగా, దానికి సమంత క‌రెక్ట్ అని డిసైడ్ అయి ఇప్పటిదాకా ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రాబోతున్నాడు.

ఈ సినిమా విజ‌యం గుణ‌శేఖ‌ర్, స‌మంత‌కు త‌ప్ప‌నిస‌రి.ఈ సినిమాలో అల్లు అర్జున్‌ ముద్దుల తనయ అల్లు అర్హ కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. తెలుగు భాషలోనే కాకుండా సౌత్ లో అన్ని భాషల్లో మరియు నార్త్ ఇండియాలో కూడా ఈ సినిమాని విడుద‌ల చేసే విధంగా ప్లాన్స్ చేస్తున్నారు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News