HomesportsShahid Afridi: షాహిద్ ఆఫ్రిది కూతురి పెళ్లిపై వ‌చ్చిన క్లారిటీ.. వ‌రుడు ఎవ‌రో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Shahid Afridi: షాహిద్ ఆఫ్రిది కూతురి పెళ్లిపై వ‌చ్చిన క్లారిటీ.. వ‌రుడు ఎవ‌రో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Telugu Flash News

Shahid Afridi: మాజీ క్రికెట‌ర్ షాహిద్ ఆఫ్రిది కూతురి పెళ్లికి సంబంధించిన కొన్నాళ్లుగా అనేక వార్త‌లు వ‌స్తున్నాయి. పాకిస్థాన్‌ స్టార్‌ పేస్‌ బౌలర్‌ షాహీన్‌ షా అఫ్రిదిని పెళ్లి చేసుకోబోతున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్న‌ప్ప‌టికీ దానిపై క్లారిటీ అయితే రావ‌డం లేదు. ఈ వార్తలు గత ఏడాది నుంచే వస్తున్నా.. ఇప్పుడీ జంట పెళ్లి ముహూర్తం ఎట్ట‌కేల‌కు ఖరారైంది. నిఖా తేదీని ఫిక్స్‌ చేసినట్లు షాహిద్‌ అఫ్రిది వెల్లడించాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 3న వీళ్లిద్దరూ పెళ్లితో ఒక్కటవ్వనున్నట్లు ఆయ‌న‌ తెలిపాడు. ఈ విషయాన్ని క్రికెట్‌ పాకిస్థాన్ కూడా వెల్లడించింది. షాహిద్‌ అఫ్రిది కూతురు అన్షాను షాహీన్‌ పెళ్లి చేసుకోబోతున్నాడు. వీళ్ల పెళ్లి కరాచీలో జరగనున్నట్లు క్రికెట్‌ పాకిస్థాన్ పేర్కొంది. ఇక నిఖా తర్వాత గ్రాండ్‌గా వెడ్డింగ్‌ రిసెప్షన్‌ కూడా ఏర్పాటు చేయనున్నారు.

పాకిస్తాన్ ప్ర‌ధాన పేస్ బౌల‌ర్‌గా మారిన షాహీన్ ప్రస్తుతం అపెండిసైటిస్‌ ఆపరేషన్‌ నుంచి కోలుకుంటున్నాడు. దీంతో నేషనల్‌ టీమ్‌కు అతడు దూరంగా ఉంటూ వ‌స్తున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌ టీమ్‌కు ఆడిన షాహీన్.. ఫైనల్లో కీలకమైన సమయంలో గాయపడటంతో తన టీమ్‌ను గెలిపించలేకపోయాడు. ఇక ఇంగ్లండ్‌తో సిరీస్‌కు కూడా ఆయ‌న దూరంగా ఉన్నాడు. అతడు లేని పాకిస్థాన్‌ బౌలింగ్‌ బలహీనంగా మారిపోవడంతో ఇంగ్లండ్‌ టీమ్‌ పాక్‌ను వాళ్ల సొంతగడ్డపై మూడు టెస్ట్‌ల సిరీస్‌లో వైట్‌ వాష్‌ చేసిన విష‌యం విదిత‌మే.

 

20 ఏళ్ల షాహీన్ పాకిస్తాన్‌ టీమ్‌లో ప్రధాన పేస్ బౌలర్‌గా ఉన్నాడు. అన్ని ఫార్మాట్‌లలో రాణిస్తూ సత్తా చాటుతున్నాడు. . 2021లో షాహీన్‌ షా అఫ్రిది ఐసీసీ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు గెలుచుకున్న తొలి పాకిస్థానీ ప్లేయర్‌గా నిలిచాడు. ఇప్పటి వరకూ పాక్‌ టీమ్‌ తరఫున 25 టెస్టుల్లో 99 వికెట్లు, 32 వన్డేల్లో 62 వికెట్లు, 47 టీ20ల్లో 58 వికెట్లు తీశాడు. పెళ్లి త‌ర్వాత అత‌ని జాతకం మ‌రింత మారుతుందని ఆయ‌న అభిమానులు విశ్వ‌సిస్తున్నారు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News