Telugu Flash News

Shahbaz Ahmed: తండ్రితో గొడ‌వ‌, బీటెక్ డిస్‌కంటిన్యూ…ఆర్‌సీబీ ఆల్‌రౌండ‌ర్ జీవితంలో ఇన్ని క‌ష్టాలా..!

shahbaz ahmed

Shahbaz Ahmed: క్రికెట‌ర్స్ లేదంటే సినిమా సెల‌బ్రిటీస్‌లో కొంద‌రు నేడు ఉన్న‌త స్థానంలో ఉన్నారంటే దాని వెన‌క ఎంతో కృషి ఉంది. ఈ గెలుపు అంత ఆషామాషీగా వచ్చిందేమి కాదు. టీమిండియా యువ ఆల్‌రౌండర్, ఆర్‌సీబీ స్టార్ షెహ్‌బాజ్ అహ్మద్ త‌న క‌న్న క‌ల‌ని నిజం చేసుకోవ‌డానికి ఎన్నో క‌ష్టాలు ప‌డ్డాడు.

ఆయ‌న జీవితం గురించి తెలుసుకున్న ప్ర‌తి ఒక్క‌రు అవాక్క‌వుతున్నారు. ఆయ‌న తాత హెడ్‌మాస్టర్.. తండ్రి గవర్నమెంట్ క్లర్క్.. బాబాయ్ ప్రభుత్వ టీచర్.. సోదరి డాక్టర్.. అందరు మంచి చ‌దువులు చ‌దువుకొని మంచి స్థాయిలో ఉంటే మ‌నోడు మాత్రం సివిల్ ఇంజనీరింగ్‌ను మధ్యలోనే వదిలేసాడు.

చాలా క‌ష్ట‌ప‌డ్డాడు..

క్రికెట‌ర్‌గా సత్త చాటిన త‌ర్వాత ఇంటికి వ‌స్తాన‌ని శ‌ప‌థం చేసిన షెహ్‌బాజ్ దేశవాళీలో సత్తా చాటి.. వరల్డ్ బిగ్గెస్ట్ లీగ్ ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అక్కడా అదరగొట్టి టీమిండియా జ‌ట్టులోకి వ‌చ్చాడు. సౌతాఫ్రికాతో ఆదివారం జరిగిన రెండో వన్డేతో ఈ ఆర్‌సీబీ స్టార్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఓ వికెట్ తీసిన షెహ్‌బాజ్ జట్టుకు కావాల్సిన బ్రేక్ త్రూ అందించాడు.

అయితే ఆయ‌న ఈ స్థాయికి రావ‌డం వెన‌క చాలా కృషి ఉంది. షెహ్‌బాజ్ జీవితం అంద‌రికి స్పూర్తి దాయ‌కం. క్రికెట్‌పై ఉన్న మక్కువతో 2015లో సివిల్ ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్‌లోనే వదిలేసాడు.

చదువు విషయంలో తండ్రితో గొడవపడి మరీ ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. ఇక అక్క‌డ నుండి ఒక్కో మెట్టు ఎక్కుతూ వ‌చ్చి ఐపీఎల్ 2022 సీజన్‌లో కనీస ధర రూ.20 లక్షలతో ఆర్‌సీబీలోకి వచ్చాడు. అతను సత్తా చాటడంతో ఐపీఎల్ 2022 సీజన్‌లో రూ.2.4 కోట్ల భారీ ధరకు ఆర్‌సీబీ మళ్లీ కొనుగోలు చేసింది.

ఐపీఎల్ ద్వారా కోట్లు వచ్చినా.. అందులో నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని షెహ్‌బాజ్ తండ్రి అహ్మద్ జాన్ తెలిపాడు. నేను ఓ ప్రభుత్వ ఉద్యోగిని. నా సాలరీతో కుటుంబాన్ని పోషించగలను. అందుకే షెహ్‌బాజ్ సంపాదనలో నుంచి ఒక్క రూపాయి తీసుకోలేదు అని అన్నాడు.

షెహ్‌బాజ్ మంచి స్టూడెంట్ . ఎక్క‌డ త‌న జీవితాన్ని నాశ‌నం చేసుకుంటాడో అని చాలా కంగారు ప‌డ్డాను. మ‌నోజ్ తివారి సాయంతో నా కొడుకు ఈ స్థాయ‌కి చేరుకున్నాడు అంటూ కొడుకు గురించి చెప్పుకొచ్చాడు షెహ్‌బాజ్ తండ్రి.

Exit mobile version